సినీ ఇండస్ట్రీలో ఛాన్స్ దక్కించుకోవడం అంటే సాధారణ విషయం కాదు. ఎన్నో కష్టాలు పడుతూ స్టూడియోల వెంట తిరుగుతూ ఒక్క ఛాన్సు కోసం ఎదురుచూసే నటులు ఎంతోమంది ఉంటారు. తమ అభిమాన హీరో, హీరోయిన్లు కనిపిస్తే ఒక్క ఫోటో తీసుకొని తెగ సంబరపడిపోతుంటారు.
ఎప్పుడో తమ అభిమాన హీరోలతో ఫోటోలు తీయించుకున్నవారు.. ఒకానొక సమయంలో అదే హీరోతో కలిసి నటించే అవకాశం దక్కించుకోవడం నిజంగా అదృష్టం అనే చెప్పొచ్చు. తమిళ నాట హీరో అజిత్ కుమార్ అంటే ఫ్యాన్స్ ప్రాణం ఇస్తుంటారు. అజిత్ కుమార్ పక్కన నిల్చుకొని ఉన్న ఓ కుర్రాడి ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇంతకీ ఆ కుర్రాడు ఎవరా అనుకుంటున్నారా? ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్ లో మంచి ఫామ్ లో ఉన్న నటుడు. వివరాల్లోకి వెళితే..
తమిళ ఇండస్ట్రీలో స్టార్ హీరో అజిత్ కుమార్ అంటే ఎంతగానో అభిమానించే ఓ కుర్రాడు అనుకోకుండా కలిశాడు.. ఇంకేముంది తన అభిమాన హీరో అజిత్ పక్కన నిల్చుకొని ఫోటో తీయించుకొని తెగ సంబరపడిపోయాడు. కట్ చేస్తే ఇప్పుడు ఆ కుర్రాడు పాన్ ఇండియా స్థాయిలో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్నాడు. హీరో, కమెడియన్, విలన్, క్యారెక్టర్ అర్టిస్టుగా ఎలాంటి పాత్ర తనదైన స్టైల్లో నటించి మెప్పిస్తాడు. కెరీర్ బిగినింగ్ లో ధనుష్ వంటి స్టార్ హీరో పక్కన చిన్న చిన్న రోల్స్ లో నటించిన ఆయన తర్వాత సోలో హీరోగా నటించాడు. ఆ తర్వాత విలన్, కమెడియన్ గా నటించాడు. ప్రస్తుతం తెలుగు, తమిళ, మళియాల, హిందీ బాషల్లో వరుసగా నటిస్తూ బిజీ బిజీగా మారాడు. ఇంతకీ ఆ నటుడు ఎవరా అనుకుంటున్నారా? ఆయన ఎవరో కాదు.. కోలీవుడ్ స్టార్ విజయ్ సేతుపతి.
తమిళనాట ఆయన్ని ‘మక్కల్ సెల్వన్’ అని అంటుంటారు. కెరీర్ బిగినింగ్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ప్రస్తానాన్ని ఆరంభించిన విజయ్ సేతుపతి.. తర్వాత స్టార్ హీరోగా ఎదిగాడు. భాషతో సంబంధం లేకుండా ఏ ఇండస్ట్రీలో అయినా సరే నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో నటించి మెప్పించాడు. 1996 లో వచ్చి లవ్ బర్డ్స్ మూవీతో సినీ రంగ ప్రవేశం చేశాడు. పదేళ్ల వరకు ఎలాంటి గుర్తింపు లేని పాత్రల్లో నటించాడు. చివరికి ‘తెన్‌మెర్కు పరువకాట్రు’ మూవీతో హీరోగా ఛాన్స్ దక్కించుకున్నాడు. ఆ తర్వాత 2012 లో వచ్చిన పిజ్జా మూవీతో విజయ్ సేతుపతికి మంచి గుర్తింపు లభించింది. 2019 లో చిరంజీవి నటించిన ‘సైరా నరసింహారెడ్డి’ మూవీతో తెలుగు తెరపైకి అడుగుపెట్టి తెలుగు లో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించాడు. ప్రస్తుతం హిందీ మూవీస్ లో కూడా నటిస్తున్నాడు. మొత్తానికి పాన్ ఇండియా స్టార్ గా విజయ్ సేతుపతి ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్నాడు.