బిగ్బాస్..దక్షిణాది భాషల్లో దూసుకుపోతు బుల్లితెరపై తెగ హల్చల్ చేస్తున్న రియాలీ షో ఇదే. ఇక తెలుగు బుల్లితెరపై ఈ షో చేసే అల్లరి అంతా ఇంతా కాదని చెప్పాలి. బిగ్బాస వస్తుందంటే చాలు ప్రేక్షకులు పనులన్నీ మానుకుని టీవీలకు అత్తుక్కుపోతుంటారు. అలాంటి షో మళ్లీ ఎప్పుడు మొదలవుతుందా అని తెలుగు బుల్లితెర ప్రేక్షకులు ఎదరుచూస్తున్నారు.
ఇప్పటికే దీనికి సంబందించిన ప్రోమో ఒకటి విడుదల కాగా సీజన్-5 ఎప్పుడు మొదలవుతుందోనని తెగ టెన్షన్ పడుతూ డేట్ కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇక తాజాగా ఫైనల్ డేట్ను ప్రకటిస్తూ ట్విట్టర్లో తెలిపింది స్టార్ మా. బిగ్బాస్-5 సెప్టెంబర్ 5 ప్రారంభం కానుందని తెలిపింది. ఇక సాయంత్రం 6 గంటలకు మొదలవనుందని స్టార్ మా తెలియజేసింది. ఇక వార్తతో బిగ్బాస్ అభిమానులు ఎగిరిగంతేస్తున్నారు.
Time to end the boredom. #BiggBossTelugu5 starting September 5th at 6 PM on #StarMaa pic.twitter.com/lcEtuEGGBq
— starmaa (@StarMaa) August 26, 2021