కారు డ్రైవర్ డ్రైవింగ్ చేస్తూ ఉన్నాడు. ఆమె వెనకాలి సీటులో కూర్చుని ఉంది. ఈ నేపథ్యంలో ఓ ట్రక్ అతి వేగంతో ఈ కారుపైకి దూసుకువచ్చింది. అంతే! ఆ వేగానికి కారు నుజ్జునుజ్జయింది.
ఈ మధ్య కాలంలో రోడ్డు ప్రమాదాలు ఎక్కువయిపోయాయి. తప్పు ఎవరిదైనా.. నిండు ప్రాణాలు బలవుతున్న సందర్భాలే ఎక్కువగా ఉంటున్నాయి. సాధారణ జనం దగ్గరినుంచి సినీ సెలెబ్రిటీల వరకు చాలా మంది రోడ్డు ప్రమాదాల్లో గాయపడుతున్నారు. తాజాగా, ప్రముఖ బాలీవుడ్ సీరియల్ నటి స్నేహాల్‌రాయ్ కారు ప్రమాదానికి గురయ్యారు. ఆమె వెళుతున్న కారును ఓ ట్రక్ ఢీకొట్టడంతో ప్రమాదం చోటుచేసుకుంది. అయితే, దేవుడి దయ వల్ల నటి చిన్న చిన్న గాయాలతో బయటపడ్డారు. ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. గత శనివారం స్నేహాల్ రాయ్ తన కారులో పూనె వెళుతూ ఉన్నారు.
కారు డ్రైవర్ డ్రైవింగ్ చేస్తూ ఉన్నాడు. ఆమె వెనకాలి సీటులో కూర్చుని ఉంది. ఈ నేపథ్యంలో ఓ ట్రక్ అతి వేగంతో ఈ కారుపైకి దూసుకువచ్చింది. ఆ ట్రక్ కారును బలంగా ఢీకొట్టింది. దీంతో కారు నుజ్జునుజ్జయింది. అయితే, ఈ ప్రమాదంలో డ్రైవర్‌కు కానీ, నటికి కానీ, పెద్దగా గాయాలు కాలేదు. కొద్దిసేపటి తర్వాత నటి కారులోంచి బయటకు వచ్చి ట్రక్ డ్రైవర్‌ను పరిహారం ఇవ్వమని అడిగారు. అయితే, ట్రక్ డ్రైవర్ ఇందుకు ఒప్పుకోలేదు. పైగా నటిపై బెదిరింపులకు దిగాడు. డబ్బులు ఇవ్వకుండానే అక్కడినుంచి పరారయ్యాడు. అనంతరం సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు.
స్నేహాల్ దగ్గరినుంచి ప్రమాదం గురించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. వారు ట్రక్ వివరాలు అడగ్గా.. తనకు ఏమీ తెలియదని ఆమె చెప్పారు. ప్రమాదం కారణంగా తాను ఇంకా షాక్‌లోనే ఉన్నానని స్పష్టం చేశారు. దీనిపై పోలీస్ కంప్లైంట్ కూడా ఆమె ఇవ్వలేకపోయారు. పోలీసులు ఆమె పరిస్థితి అర్థం చేసుకున్నారు. గాయపడ్డ ఆమెను, కారు డ్రైవర్‌ను దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. మరి, ఈ సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.