ప్రముఖ తమిళ సీరియల్ దర్శకుడు రత్నం భార్య ఆత్మహత్య చేసుకుంది. ఆయన తన పిల్లలను తీసుకురావటానికి పొల్లాచి వెళ్లిన సమయంలో ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
భారతీయ చిత్ర పరిశ్రమలో వరుస విషాదాలు చోటుచేసుకుంటూ ఉన్నాయి. ముఖ్యంగా తమిళ ఇండస్ట్రీలో ప్రముఖుల కుటుంబ సభ్యులు మరణిస్తూ ఉన్నారు. వారం రోజుల క్రితం ప్రముఖ నటి పవిత్ర లక్ష్మి తల్లి మరణించింది. తల్లి మరణంపై ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ ఎమోషనల్ పోస్టు్ పెట్టింది. ఈ సంఘటన మరువక ముందే మరో సంఘటన చోటుచేసుకుంది. ప్రముఖ తమిళ సీరియల్ దర్శకుడు రత్నం భార్య ఆత్మహత్య చేసుకుంది. ఇంట్లో ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకుంది. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. కొద్దిరోజుల క్రితం దర్శకుడు రత్నం తన పొల్లాచిలో ఉన్న తన పిల్లలను తీసుకురావటానికి వెళ్లారు. భార్య ప్రియను అతడు ఇంట్లోనే వదిలి పొల్లాచి వెళ్లాడు.
రత్నం పిల్లలను ఇంటికి తీసుకువచ్చిన తర్వాత దారుణ దృశ్యం వెలుగుచూసింది. రత్నం భార్య ప్రియ బెడ్‌రూములోని ఫ్యానుకు ఉరి వేసుకుని కనిపించింది. దీంతో ఆమెను ఉరి నుంచి కిందకు దింపి రాయపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే ఆమె చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. సమచారం అందుకున్న పోలీసులు ఆసుపత్రికి చేరుకున్నారు. అనుమానస్పద మృతి కింద కేసు నమోదు చేశారు. ప్రియ మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు. పోస్టుమార్టం రిపోర్టు వచ్చిన తర్వాత ఆమె మరణానికి గల కారణాలు తెలిసే అవకాశం ఉంది.
కాగా, రత్నం తమిళ సీరియల్ దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అలగు, వాణి రాణి సీరియల్స్‌తో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. రత్నం పొల్లాచిలో ఉండగా ప్రియతో పరిచయం అయింది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. రెండు కుటుంబాల అనుమతితో ఇద్దరూ ఒక్కటయ్యారు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే, ప్రియ ఎందుకు ఆత్మహత్య చేసుకుందున్న కారణాలు తెలియలేదు. మరి, దర్శకుడు రత్నం భార్య ప్రియ ఆత్మహత్యపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.