నటీనటులు వారు నటించే సినిమాలు సాధించే విజయాలపై వారి సినిమా జీవితం ఆధారపడి ఉంటుంది. కొంత మంది హీరో హీరోయిన్లు ఇండస్ట్రీలో అవకాశాలు రాక తెర నుంచి కనుమరుగైన ఉదంతాలు చాలానే ఉన్నాయి.
నటీనటులు వారు నటించే సినిమాలు సాధించే విజయాలపై వారి సినిమా జీవితం ఆధారపడి ఉంటుంది. కొంత మంది హీరో హీరోయిన్లు ఇండస్ట్రీలో అవకాశాలు రాక తెర నుంచి కనుమరుగైన ఉదంతాలు చాలానే ఉన్నాయి. అయితే నటీనటులు వారు నటించిన సినిమాలు కొన్ని హిట్ టాక్ తో, మరికొన్ని ఫ్లాప్ టాక్ తో ముగుస్తాయి. హిట్ అయిన సినిమాల ద్వారా మంచి పేరు వచ్చి స్టార్ డం సాధిస్తారు. దీంతో ఇండస్ట్రీలో అవకాశాలు కూడా విరివిగా వస్తాయి. కానీ ఇక్కడ ఓ హీరోయిన్ మాత్రం ఓ గొప్ప చిత్రంలో నటించినప్పటికి తనకు ఏం గుర్తింపు రాలేదని చెప్పుకొచ్చింది.
టాలీవుడ్ లో తన నటనతో, అందంతో సినిమాల్లో నటించి సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుంది నటి తమన్నా. తన హుషారైన డ్యాన్స్ తో యూత్ మనసులను కొల్లగొట్టింది. శ్రీ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ అమ్మడు ఆ తరువాత పలు హిట్ సినిమాల్లో నటించింది. దాదాపు టాలీవుడ్ లోని టాప్ హీరోలందరితో నటించి మెప్పించింది. తెలుగులోనే కాకుండా తమిళ్, హిందీ సినిమాల్లో కూడా తమన్నా నటించింది. తాజాగా ఓ ఇంటర్వ్యూకి హాజరైన మిల్కీ బ్యూటీ బాహుబలి చిత్రంతో తనకు ఎలాంటి గుర్తింపు రాలేదని షాకింగ్ కామెంట్స్ చేసింది.
టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన బాహుబలి సినిమా ఎంతటి ఘనవిజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందులో నటించిన నటీనటులకు పేరు ప్రఖ్యాతలు లభించాయి. ముఖ్యంగా ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ అయిపోయారు. రానా, రమ్యకృష్ణ, అనుష్కలకు కూడా మంచి గుర్తింపు వచ్చింది. అయితే బాహుబలి సినిమాలో అవంతిక పాత్రలో మెరిసిన తమన్నా ఆ పాత్రలో ప్రేక్షకులను ఆకట్టుకుంది. కాగా తమన్న ఓ ఇంటర్య్వూలో మాట్లాడుతూ బాహుబలిలో నటించిన వారందరికీ మంచి గుర్తింపు వచ్చిందని, తనకు మాత్రం ఆశించిన స్థాయిలో గుర్తింపు రాలేదని వెల్లడించింది. బాహుబలి సక్సెస్ తో తను ఏవిధమైన లబ్థి పొందలేదని తెలిపింది. ఇదిలా ఉంటే నటుడు విజయ్ వర్మతో రిలేషన్ లో ఉందంటూ పుకార్లు వచ్చిన నేపథ్యంలో తమన్న స్పందించింది. తనతో రిలేషన్ లో ఉన్నది నిజమేనంటూ కుండబద్దలు కొట్టింది. ఇక వరుస సినిమాలు, వెబ్ సిరీస్ లు చేస్తూ బిజీబిజీగా ఉంటోంది నటి తమన్నా.