హీరో సూర్య అంటే తమిళంలోనే కాదు తెలుగులో కూడా చాలా పెద్ద ఫ్యాన్ బేస్ ఉంది. మన స్టార్ హీరోలకు ఏ మాత్రం తగ్గకుండా ఫాలోయింగ్ ఉంది. సూర్య సినిమా వస్తుందంటే అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. దానికి కారణం.. ప్రతి చిత్రంలోనూ ఏదో కొత్తగా ట్రై చేస్తుంటాడు. ఆ నమ్మకం ప్రేక్షకుల్లో ఉంది. అందుకు తగ్గట్లే ప్రతి సినిమాతోనూ ఎంటర్ టైన్ చేస్తుంటారు. ఈ క్రమంలోనే కొన్ని హిట్ అవుతుండగా, మరికొన్ని ఫ్లాప్ అవుతుంటాయి. ఇప్పుడు కూడా మరో క్రేజ్ ప్రాజెక్టుతో అభిమానుల్ని పలకరించనున్నట్లు తెలుస్తోంది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. లాక్ డౌన్ టైమ్ లో సూర్య హీరోగా చేసిన ‘ఆకాశమే నీ హద్దురా’, ‘జై భీమ్’ చూసి మనం ఫిదా అయిపోయాం. ఇక ఈ ఏడాది మార్చిలో ‘ఈటీ’తో వచ్చినా ఫెయిలయ్యాడు. ఈ మధ్య ‘విక్రమ్’లో రోలెక్స్ సర్ అని థియేటర్స్ మొత్తాన్ని షేక్ చేసిన సూర్య… ఇప్పుడు పలు చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం శివ డైరెక్షన్ లో ఓ సినిమా చేస్తున్నాడు. ఇప్పుడు దానికి సంబంధించిన మోషన్ పోస్టర్ ని తాజాగా రిలీజ్ చేశారు. ఇందులో ఫుల్ వయలెంట్ గా కనిపిస్తున్న సూర్య.. అంచనాల్ని పెంచేస్తున్నాడు.
ఈ మోషన్ పోస్టర్.. వేరే లెవల్లో ఉంది. ఉహించని విధంగా అద్భుతమైన విజువల్స్ తో ఈ వీడియోని రూపొందించారు. మ్యూజిక్ డైరెక్టర్ దేవీశ్రీ ప్రసాద్.. బీజీఎం అయితే పాత డీఎస్పీని గుర్తుకుతెచ్చింది. భారీ పీరియాడికల్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా వీడియో చూస్తే అర్థమవుతోంది. పాన్ ఇండియా అంటూ ఐదు భాషల్లో అందరూ రిలీజ్ చేస్తుండగా.. ఇప్పుడు సూర్య 42 ప్రాజెక్టుని ఏకంగా 10 భాషల్లో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. మరి ఈ మోషన్ పోస్టర్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో పోస్ట్ చేయండి.
ఇదీ చదవండి:హీరో సూర్యకు అరుదైన గౌరవం.. దక్షిణాది నుంచి తొలి హీరో!