భారతీయ చలన చిత్ర రంగంలో అతి కొద్ది మంది సూపర్ స్టార్లుగా ఎదిగారు.. వారిలో రజినీకాంత్ ఒకరు. నటుడు, నిర్మాత, స్క్రీన్ రైటర్‌గా చేసిన కృషికి గానూ సూపర్ స్టార్ రజినీకాంత్ 51 వ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును అందుకోబోతున్నారు. రజనీకాంత్ 1975లో దివంగత దర్శకుడు కె. బాలచందర్ ‘అపూర్వ రాగంగళ్’ సినిమాతో తన నటనా రంగ ప్రవేశం చేశారు. కెరీర్ బిగినింగ్ లో విలన్ గా నటించిన ఆయన తర్వాత హీరోగా మారారు. గత నాలుగు దశాబ్దాలుగా హీరోగా నటిస్తూ వస్తున్నారు.. ఇప్పటికీ ఆయన యంగ్ హీరోలకు పోటీగా నటించి ప్రేక్షకుల మన్ననలు పొందుతున్నారు.
కాగా, రజినీకాంత్ 51 వ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును అందుకోబోతున్నట్టుగా కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ గురువారం ఆయనను “భారతీయ సినిమా చరిత్రలో గొప్ప నటులలో ఒకరు” అని వ్యాఖ్యానిస్తూ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. ప్రధానమంత్రి మోడీ సైతం ఆయనకు శుభాకాంక్షలు చెబుతూ ట్వీట్ చేశారు. తాజాగా ప్రతిష్టాత్మక దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును గెలుచుకోవడంపై సంతోషాన్ని వ్యక్తం చేస్తూ రజినీకాంత్ ట్విట్టర్ లో ఒక లేఖను విడుదల చేశారు.
My heartfelt thanks to the government of india, respected & dearest @narendramodi ji, @PrakashJavdekar ji and the jury for conferring upon me the prestigious #DadasahebPhalkeAward I sincerely dedicate it to all those who have been a part of my journey. Thanks to the almighty 🙏🏻
— Rajinikanth (@rajinikanth) April 1, 2021
తనకు ఈ అవార్డును ప్రదానం చేసినందుకు కేంద్ర ప్రభుత్వానికి, ప్రధాని నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. తన సోదరుడు, మిత్రుడు.. సినీ రంగంలో తనతో ప్రయాణం చేసి తనను ప్రోత్సహించిన తన గురువు కె బాలచందర్, తన సినిమాలకు పని చేసిన దర్శకులు, నిర్మాతలు, సాంకేతిక నిపుణులందరికీ, అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు.
రజనీకాంత్ ఈరోజు అక్టోబర్ 24న చెన్నైలోని పోయెస్ గార్డెన్ హౌస్ దగ్గర మీడియాతో సమావేశమై ప్రతిష్టాత్మక దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును గెలుచుకోవడం గురించి మాట్లాడుతూ.. తానెప్పుడూ ఈ గౌరవనీయమైన అవార్డును గెలుచుకుంటానని ఊహించలేదని చెప్పారు. ఇలాంటి సమయంలో తన గురువు కె బాలచందర్ సజీవంగా లేరని, ఆయన లేకుండా అవార్డు అందుకోవడం బాధగా ఉందని అన్నారు. ప్రస్తుతం సూపర్‌స్టార్ రజనీకాంత్ దీపావళి సందర్భంగా నవంబర్ 4న విడుదల కానున్న ‘అన్నాత్తే’లో కనిపించనున్నారు. ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ తెలుగులో ‘పెద్దన్న’ పేరుతో విడుదల కానుంది
🙏🏻🇮🇳 pic.twitter.com/vkTf6mxYUu
— Rajinikanth (@rajinikanth) October 24, 2021