బాలీవుడ్ హాట్ బ్యూటీ సన్నీలియోన్ గురించి ప్రత్యకంగా చెప్పనక్కరలేదు. ఒకప్పుడు హాలీవుడ్ లో ఫోర్న్ చిత్రాలతో కుర్రాళ్ల మతులు పోగొట్టిన ఈ హాట్ బ్యూటీ.. ఇప్పుడు వాటన్నీంటికి గుడ్ బాయ్ చెప్పి, బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ హూస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ లో ఎంట్రీ ఇచ్చింది. తర్వాత జిస్మ్ 2 లో హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రం మంచి హిట్ అందుకుంది. ఆ తర్వాత హీరోయిన్, కో ఆర్టిస్ట్ గా నటిస్తూ.. తెలుగు, తమిళ, కన్నడ,మళియాళ చిత్రాల్లో ఐటమ్ సాంగ్స్ లో కూడా ఆడిపాడింది.
తెలుగు లో కరెంట్ తీగ, గరుడవేగ చిత్రాల్లో ఐటమ్ సాంగ్ లో నటించింది. ప్రస్తుతం ఈ బ్యూటీ పలు ఐటమ్ సాంగ్స్ లో నటిస్తోంది. తాజాగా సన్నీలియోన్ ముంబై ఎయిర్‌పోర్టులో పరుగులుపెట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ముంబై ఎయిర్‌పోర్టుకు చేరుకున్న సన్నీలియోన్ అక్కడ సెక్యూరిటీ వద్ద క్లియరెన్స్ పొందుతున్న సమయంలో అక్కడికి ఫోటో గ్రఫర్లు చేరుకున్నారు.
ఇక ఫోటో షూట్స్ కి ఫోజులు ఇచ్చే పనిలో పడింది ఈ బ్యూటీ. అంతలోనే వెళ్లేందుకు పర్మిషన్ రావడం, అక్కడే ఆలస్యం కావడంతో తన సిబ్బందితో కలిసి వేగంగా పరుగెత్తుకుంటూ వెళ్లిపోయింది. ఈ వీడియోను మీడియా ఫొటోగ్రాఫర్ తన అకౌంట్‌లో షేర్ చేయగా.. ఫ్యాన్స్ ఫన్నీ కామెంట్లతో రియాక్ట్ అవుతున్నారు. మరి మీరు కూడా ఈ వీడియోపై ఓ లుక్ వేసేయండి.