హీరో కావాలంటే.. ఒడ్డు, పొడుగుతో పాటు మంచి కలర్ ఉండాలి లాంటివి ఒకప్పటి మాటలు. ఇప్పుడు ట్రెండ్ మారింది. కమర్షియల్ సినిమాలతో పాటు కంటెంట్ బేస్డ్ మూవీస్ ప్రేక్షకుల్ని విపరీతంగా ఎంటర్ టైన్ చేస్తున్నాయి. మరోవైపు ఒకప్పుడు హీరో అంటే యాక్టింగ్ స్కూల్ లో ట్రైనింగ్ తీసుకుని వచ్చేవారు. ఇప్పుడు ఆ విషయంలో కూడా చాలా మార్పులు జరిగాయి. యూట్యూబ్ షార్ట్ ఫిల్మ్స్ తో ఫేమస్ అయిన వాళ్లు.. హీరో, హీరోయిన్లుగా గుర్తింపు తెచ్చుకుంటున్నారు. అలాంటి సుహాస్ ముందుంటాడు.
ఇక విషయానికొస్తే.. సుహాస్ గురించి కచ్చితంగా చెప్పుకోవాలి. హీరో, విలన్, కమెడియన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్.. ఇలా ఏదైనా సరే తన మార్క్ యాక్టింగ్ తో అదరగొడుతూ దూసుకుపోతున్నాడు. ‘కలర్ ఫోటో’ మూవీతో హీరోగా గుర్తింపు తెచ్చుకున్నప్పటికీ.. హీరోగా మాత్రమే చేస్తానని గిరి గీసుకుని కూర్చోలేదు. గతేడాది చివర్లో రిలీజైన ‘హిట్ 2’లో సైకో విలన్ గా ఆకట్టుకున్నాడు. ఇప్పుడు మరోసారి హీరోగా ‘రైటర్ పద్మభూషణం’గా థియేటర్లలోకి వచ్చేందుకు రెడీ అయిపోయాడు. ఈ క్రమంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. తన గురించి బోలెడు విషయాల్ని చెప్పుకొచ్చాడు.
ఇక తన ప్రేమ పెళ్లి గురించి చెప్పుకొచ్చిన సుహాస్.. అప్పట్లో చాలా ఇంట్రావర్ట్ అయిన తాను లేచిపోయి మరీ మ్యారేజ్ చేసుకున్న విషయాన్ని గుర్తుచేసుకున్నాడు. ఇక తన సినిమాల గురించి చెప్పిన సుహాస్.. ‘ఫ్యామిలీ డ్రామా’ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాడు. ఇందులో సైకో లక్షణాలున్న వ్యక్తిగా అదరగొట్టేశాడు. ఇది రిలీజైన తర్వాత.. తన భార్య మూడు రోజుల పాటు ఇంటికి రావొద్దని, ఆఫీస్ లో పడుకోమని చెప్పిందని అన్నాడు. ఆ తర్వాత ఇంట్లో నార్మల్ గా నవ్వుతున్నా సరే.. ఆ పాత్ర ప్రభావం వల్ల కాస్త భయపడేదని చెప్పుకొచ్చాడు. ఇక ఈ విషయం కాస్త ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తోంది. మరి సుహాస్ సినిమా పాత్రకు అతడి భార్య భయపడటంపై మీరేం అనుకుంటున్నారు. కింద కామెంట్స్ లో మీ అభిప్రాయాన్ని పోస్ట్ చేయండి./p>