సుడిగాలి సుధీర్ పేరు చెప్పగానే అద్భుతమైన కమెడియన్, యాంకర్, మెజీషియన్, డ్యాన్సర్.. ఇలా ఒకటేమిటి ఎన్నో గుర్తొస్తాయి. స్మాల్ స్క్రీన్ మెగాస్టార్ మనోడు. ‘జబర్దస్త్’లో కమెడియన్ గా కెరీర్ ప్రారంభించిన మనోడు.. చిన్నచిన్నగా ఎదుగుతూ టీమ్ లీడర్ అయ్యాడు. షో తనకోసమే చూసేంతలా క్రేజ్ సంపాదించాడు. అలాంటి సుధీర్ సడన్ గా పూర్తిగా టీవీ షోలు మానేశాడు. దీంతో అభిమానులు చాలా ఫీలయ్యారు. ఏం జరిగింది? అని తెగ మాట్లాడుకున్నారు. వస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. ఇప్పుడు వారు కోరుకున్నది నిజమైంది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. సుడిగాలి సుధీర్ అనగానే యాంకర్ రష్మీ కూడా గుర్తొస్తుంది. వీళ్లిద్దరి ప్రేమ వ్యవహారం ఇప్పటికే ఎండ్ లెస్ టాపిక్. అంటే ‘జబర్దస్త్’ టీఆర్పీ కోసం వీళ్ల మధ్య లవ్ అనే కాన్సెప్ట్ క్రియేట్ చేశారు. దాన్ని సుధీర్-రష్మీ అంతే ఫెర్ఫెక్ట్ గా ప్రెజంట్ చేశారు. వీళ్లిద్దరితో చాలా స్పెషల్ ప్రోగ్రామ్స్ కూడా చేశారు. అంతలా కెమిస్ట్రీ ఉండేసరికి వీరిద్దరూ నిజంగానే పెళ్లి చేసుకుంటారు అని ప్రేక్షకులు ఫీలయ్యారు. కానీ స్క్రీన్ పై కనిపించేందుకు అలా చేస్తామని, నిజంగా తామిద్దరి మధ్య ఏం లేదని స్వయంగా సుధీర్-రష్మీ క్లారిటీ ఇచ్చినా సరే ఎవరూ నమ్మట్లేదు.
ఇక కొన్ని నెలల క్రితం ‘ఎక్స్ ట్రా జబర్దస్త్’, ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’ షోల నుంచి సుధీర్ తప్పుకోవడంతో నెటిజన్స్ తలో రకంగా మాట్లాడుకున్నారు. ఇక తిరిగొచ్చే అవకాశమే లేదని తెగ డిస్కషన్స్ పెట్టారు. కానీ రీసెంట్ గా సుమన్ టీవీతో ఇంటర్వ్యూలో మాట్లాడిన సుధీర్.. త్వరలో రీఎంట్రీ ఇస్తానని చెప్పాడు. ఇప్పుడు అలానే చేశాడు. అందుకు సంబంధించిన ప్రోమో కూడా విడుదలైంది. ఇందులో ‘గాలోడు’ మూవీ ప్రమోషన్స్ కోసం వచ్చినప్పటికీ.. తన పాత్ టీమ్ తో కలిసి స్కిట్ చేశాడు. యాంకర్ రష్మీతో డ్యూయెట్ కూడా వేసుకున్నాడు. ఇక వచ్చే వారం నుంచి సుధీర్ రెగ్యులర్ గా స్కిట్స్ చేయడం కూడా గ్యారంటీ అనిపిస్తోంది.