బీ టౌన్ బ్యూటీ సోనాక్షి సిన్హా.. సల్మాన్ ఖాన్ ‘దబాంగ్’ సినిమాతో హీరోయిన్ గా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత వరుస సినిమాల్లో హీరోయిన్ గా నటించి.. స్టార్ హీరోయిన్ మారిపోయింది. సోనాక్షి తన బొద్దు అందాలతో కుర్రకారును ఆకట్టుకుంది. అయితే ప్రస్తుతం ఆశించిన స్థాయిలో ఆమె కెరీర్ సాగడం లేదు. అడపాదడపా సినిమాలు చేస్తూ రాణిస్తుంది. ఈ బ్యూటీ సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. తనకు సంబంధించిన విషయాలను ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంటారు. తాజాగా ఆమె షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఆమెకు సీక్రెట్ గా నిశ్చితార్థం అయ్యిందనే విషయాన్ని ఆ ఫోటోలు వెల్లడిస్తున్నాయి. దీంతో ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
సోనాక్షి సిన్హా ఎంగేజ్‌మెంట్ చేసుకున్నట్టుగా పలు వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో డైమండ్ రింగ్ తొడిగినట్టు ఉన్న ఫోటోలను పంచుకోవడమే ఈ వార్తలకు ఊతమిస్తుంది. ఇందులో తన వేలికి డైమండ్ రింగ్ తొడిగి ఉంది. అంతేకాదు ఓ వ్యక్తి ఆమె చేతిని పట్టుకుని ఉన్నాడు. దీంతో సీక్రెట్ గా సోనాక్షి ఎంగేజ్‌మెంట్ చేసుకుందనే వార్తలు వినిపిస్తున్నాయి.”ఈ రోజు నా లైఫ్‌లో బిగ్ డే. నా పెద్ద కలల్లో ఒకటి నెరవేరబోతుంది. మీతో ఆ విషయాన్ని పంచుకోవడానికి వేచి ఉండలేకపోతున్నా. దీన్ని నేనే నమ్మలేకపోతున్నా” అంటూ సోనాక్షి ఇన్ స్టాలో ఫోటోలు షేర్ చేసింది. తన డ్రీమ్ నెరవేరబోతుందని తెలిపింది. మరి తన డ్రీమ్స్ ఏంటీ? నెరవేరబోయేదేంటి? అనేది సస్పెన్స్ గా మారింది. కానీ సోనాక్షి మాత్రం..ఆమె అభిమానులకి షాకిస్తూనే సస్పెన్స్ లో పెట్టిందని చెప్పొచ్చు. మరి.. ఈవిషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.