సూపర్ స్టార్ మహేష్ బాబు గారాల పట్టి సితార గురించి పరిచయం చేయాల్సిన పనిలేదు. సోషల్ మీడియాలో ఆక్టీవ్ గా ఉంటూ తనకు సంబంధించిన డ్యాన్స్ వీడియోలు, ఫ్యామిలీకి సంబంధించిన ఫొటోలు నెటిజన్స్ తో పంచుకుంటూ ఉంటుంది. తాజాగా తన పుట్టిన రోజు వేడుకల వీడియోలను తన ఇన్ స్టా ఖాతాలో పోస్ట్ చేసింది.
ప్రిన్స్ సితార ప్రజెంట్ ట్రెండింగ్‌లో ఉన్న పేరు. మహేష్ బాబు ముద్దుల కూతురు అయిన సితార చిన్న యాడ్ చేసి భారీ రెమ్యునరేషన్ తిసుకున్న చైల్డ్ యాక్టర్‌గా రికార్డ్ సృష్టింది. ఆ యాడ్‌కి వచ్చిన డబ్బులు చారిటీకి ఇచ్చింది. దీంతో తండ్రికి తగ్గ తనయ అని మహేష్ బాబు ఫ్యాన్స్ తో పాటు పలువురు ప్రశంసిస్తున్నారు. చేసింది చిన్న యాడ్ అయిన తన నటనతో అందరిని అకట్టుకుంది. తనకంటు ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. రీసెంట్‌గా తన 11వ బర్త్ డే సందర్బంగా మహేష్ బాబు ఫౌండేషన్‌లోని అమ్మాయిలకు సైకిళ్లను గిఫ్ట్‌గా ఇచ్చి మరోసారి తన మంచి మనసుని చాటుకుంది. సినిమాల్లోకి ఎప్పడు తిసుకొస్తారు అని నమ్రతను ఓ ఇంటర్వ్యూలో అడిగితె ప్రస్తుతం తన చదువు పైనా దృష్టిపెట్టింది సినిమాల్లోకి రావడానికి ఇంకా టైమ్ ఉంది అని చెప్పుకొచ్చింది.
మహేష్ బాబు ఫౌండేషన్‌లో కేక్ కట్ చేసిన అనంతరం పిల్లలతో ఫొటోస్ దిగి సరదాగా కాసేపు గడిపింది. సాయంత్రం తన ఫ్యామీలితో పాటు తన ఫ్రెండ్స్‌ని కూడా ఇన్వైట్ చేసి పార్టీ సెలబ్రెషన్స్ చేసుకున్నారు. ఫ్రెండ్స్‌తో ఎంజాయ్ చేస్తున్నా వీడియోను తన ఇన్‌స్టాలో పొస్ట్ చేసింది. అది కాస్త వైరల్‌గా మారింది. వీడియో చూసిన కొందరు నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తు కామెంట్స్ చేస్తున్నారు. పుట్టిన రోజు శుభాకాంక్షలు సితార, సితార తల్లి బంగారు తల్లి అని కొందరు కామెంట్స్ పెడుతుంటే, మరి కొందరు ఓవర్ యాక్షన్ కంపెనీ, సితార ఫ్రెండ్స్ ఏంటీ ఇలా ఉన్నారు అంటూ నెగిటివ్ కామెంట్స్ పెడుతున్నారు.
ఇక పోతే సితార వయసు చిన్నదే కాబాట్టి చదువు పూర్తి చేశాక సినిమాల్లోకి రగం ప్రవేశం చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. మహేష్ చిత్రాల విషయానికి వస్తే అతడు, ఖలేజా సినిమాల తర్వాత మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో వస్తున్న హ్యాట్రిక్ చిత్రం ‘గుంటూరు కారం’. మహేష్ సరసన శ్రీలీలా నటిస్తుంటే, విలన్ పాత్ర జగపతి బాబు చేస్తుంటే, తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై ఎస్ రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.