టాలీవుడ్ పరిశ్రమలో డబ్బింగ్ ఆర్టిస్ట్‌గానూ, ప్రముఖ సింగర్‌గానూ అందరికీ పరిచయమైన వ్యక్తి సునీత. కాగా ఇటీవల రెండో వివాహం చేసుకుని వార్తల్లో నిలిచారామే. ఇక తెలుగు చిత్ర పరిశ్రమలో సునీత ఎన్నో భిన్నమైన కళల్లో రాణించారు. సింగర్‌గా సునీత పేరు టాలీవుడ్‌లో ఓ ప్రత్యేకమనే చెప్పాలి. శ్రీరామదాసు వంటి భక్తి సినిమాలైన లేక లవ్ స్టోరీస్ సినిమాలైన తన గాత్రంతో ప్రేక్షకులను మైమరిపించేలా చేస్తోంది.
ఇక విషయం ఏంటంటే..? తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సునీత తన పెళ్లి విషయంపై కొన్ని కీలక విషయాలు పంచుకుంది. ఇక నా పెళ్లిపై ఎన్నో లేని పోని వార్తలు ఇప్పటికీ వస్తున్నాయి. కానీ నాకు చాలా బాధనిపిస్తోంది అని తెలిపింది. ఇక నేను పెళ్లి చేసుకోబోయే భర్త నన్ను జాగ్రత్తగా చూసుకునే వాడు రావాలని ప్రతీ రోజు కలలు కనేదానని తెలిపింది. కానీ అలా కాకుండా కిరన్ కుమార్ గోపరాజును మొదటి పెళ్లి పెళ్లి చేసుకున్న తర్వాత చాలా ఇబ్బందులను ఎదుర్కొవాల్సి వచ్చిందని చెప్పుకొచ్చింది సునీత.
దీంతో అసలు జీవితమంటే ఏంటో తెలుసుకుని 15 ఏళ్ల తర్వాత రామ్‌ని పెళ్లి చేసుకున్నానంది. కానీ జనాలు మాత్రం నేను రామ్‌ని డబ్బు కోసమే పెళ్లి చేసుకున్నావని అంటున్నారని తన ఆవేదన వ్యక్తం చేసింది. నాకు ఇంత వరకూ రామ్‌కు ఎన్ని ఆస్తులున్నాయో, ఎంత సంపాదిస్తున్నాడో తెలియదని సునీతి తెలిపింది. ఇక రామ్‌లోని నిజాయితీ నాకు నచ్చిందని అందుకే తనను పెళ్లి చేసుకున్నానని తెలిపింది సింగర్ సునీత.