చిత్ర పరిశ్రమలో ప్రేమలు, పెళ్ళిళ్లు, డేటింగ్ లు సర్వసాధారణమే. అదీ కాక ఈ మధ్య కాలంలో సెలబ్రిటీస్ ఒక్కొక్కరుగా పెళ్లి చేసుకుని వైవాహిక జీవితంలోకి అడుగుపెడుతున్నారు. హీరోలు హీరోయిన్ లను పెళ్లి చేసుకోవడం, నటులు సహ నటులను పెళ్లి చేసుకోవడం మనం ఇండస్ట్రీలో మనం చూస్తూనే ఉన్నాం. ఈ క్రమంలోనే ప్రముఖ సంగీత దర్శకుడిని వివాహం చేసుకుంది ఫేమస్ సింగర్. ప్రస్తుతం వీరికి సంబంధించిన పెళ్లి ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి. బాలీవుడ్ ఇండస్ట్రీలో గొప్ప సింగర్ గా పేరు సంపాదించుకున్న పాలక్ ముచ్చల్.. ప్రముఖ సంగీత దర్శకుడిని వివాహం చేసుకుంది. మరిన్ని వివరాల్లోకి వెళితే..
ఆషికి-2, ఎంఎస్ ధోని, ఏక్ థా టైగర్, ది అన్ టోల్డ్ స్టోరీ వంటి సినిమాల్లో పాటలు పాడి మంచి గుర్తింపు తెచ్చుకుంది పాలక్ ముచ్చల్. ఇక ఇదే ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ సంగీత దర్శకుడు మిథున్ శర్మతో గత కొంత కాలంగా ప్రేమలో ఉంది పాలక్. తాజాగా వీరిద్దరు వివాహంతో ఒక్కటైయ్యారు. సన్నిహితులు, బంధువుల సమక్షంలో అంగరంగ వైభవంగా వీరి పెళ్లి జరిగింది. ఈ సందర్భంగా తమ పెళ్ళి ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ..”మేమిద్దరం ఎప్పుడూ ఇలాగే సంతోషంగా.. జీవితాంతం కలిసుండాలని ఒక్కటయ్యం” అంటూ రాసుకొచ్చింది పాలక్. ఈ పిక్స్ ను చూసిన వారి అభిమానులు తెగ సంతోషిస్తున్నారు. ఇక మిథున్ శర్మ బాలీవుడ్ లో ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ గా కొనసాగుతున్నాడు. లమ్హా, మర్డర్-2, జిస్మ్-2, 3G లాంటి మరికొన్ని చిత్రాలకు సంగీతాన్ని అందించాడు. మర్డర్-2 సినిమా ద్వారా సింగర్ అర్జిత్ సింగ్ ను బాలీవుడ్ కు పరిచయం చేశాడు మిథును శర్మ.