Chinmayi: తెలుగు, తమిళ సినీ ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు చిన్మయి శ్రీపాద. ఈమె సింగర్‌గానే కాదు.. డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా కూడా చాలా ఫేమస్. చాలా మంది హీరోయిన్లకు తన గొంతను అరువిచ్చారు. సినిమాల్లో వినిపించే సమంత గొంతు చిన్మయిదే. సమంత మొదటి సినిమానుంచి చిన్మయి డబ్బింగ్ చెబుతూ ఉన్నారు. ఇక, చిన్మయి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు. ఈ నేపథ్యంలోనే పలు వివాదాల్లోనూ చిక్కుకుంటూ ఉంటారు. ఒకనొక సమయంలో సోషల్ మీడియాలో ఎదురైన ఓ అనుభవాన్ని మీడియాతో పంచుకున్నారు.
ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. ‘‘ నేను తెలుగు కొద్దిగానే నేర్చుకున్నా. పెద్ద బాలశిక్ష లాంటివి చదువుకున్నా. నాకు బూతు పదాలు అస్సలు తెలీదు. ఫ్రెండ్స్‌తో ఉండి ఉంటే నాకు తెలిసేవి కావచ్చు. పైగా నేనుండేది చెన్నైలో. ఓ సారి ట్విటర్‌లో ఒకడు నన్ను ‘‘నీలాంటి ఎల్‌ఎమ్’’ అని కామెంట్ పెట్టాడు. నాకు దాని అర్థం తెలీదు. ఎంటని అడిగా.. నాకు తెలీయకుండా అడిగా.. ఎల్‌ఎమ్ అంటే లేడీ మాఫియా అన్నాడు అతను. ఓ అవునా అనుకున్నా. ఆ తర్వాత చాలా మంది కామెంట్స్‌లో దాని నిజమైన అర్థాన్ని రాసుకొచ్చారు.
అప్పుడు నాకు అర్థం అయింది. తర్వాత రియలైజ్ అయ్యా. వీళ్లు బూతులు తిడుతుంటే నేనెందుకు బాధగా ఉండాలి అనిపించింది. పెద్దగా పట్టించుకోవటం మానేశాను’’ అని అన్నారు. కాగా, చిన్మయి తాజాగా ‘ సీతారామం’ సినిమాలో హీరోయిన్ మృణాల్‌కు గొంతు అరువిచ్చారు. తన వాయిస్‌తో మృణాల్ నటనకు ప్రాణం పోశారు. మరి, సీతారామం సినిమాలో సీత పాత్రకు డబ్బింగ్ చెప్పి మృణాల్ నటనను మరింత పెంచిన చిన్మయిపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : Jr NTR: ఇదెక్కడి మాస్ మావా.. 12 రోజులకే అంత సన్నగా అయిపోయావ్?