జూనియర్ ఎన్టీఆర్.. ప్రస్తుతం ఈపేరు పాన్ ఇండియానే కాదు పాన్ వరల్డ్ రేంజ్‌లో మారుమ్రోగుతోంది. ట్రిపులార్ సినిమాతో తారక్ పాన్ ఇండియానే కాదు పాన్ వరల్డ్ స్థాయిలో అభిమానులను సొంతం చేసుకున్నాడు. ట్రిపులార్ సినిమా రిలీజ్ అయి ఇన్ని రోజులు కావొస్తున్నా ఇంకా భీమ్ పేరు వినిపిస్తూనే ఉంది. గణేశ్ ఉత్సవాల్లోనూ భీమ్ థీమ్ మీద గణపతి విగ్రహాలు రావడం దేశవ్యాప్తంగా వైరల్ గా మారింది. టాలీవుడ్‌లో జూనియర్ ఎన్టీఆర్‌ని అజాత శత్రువు అనడంలో అతిశయోక్తి లేదు. చిన్నాపెద్ద తేడా లేకుండా అంతా తారక్ అభిమానిస్తూనే ఉంటారు. ఇటీవలే కేంద్ర హోంమంత్రి అమిత్ షా సైతం హైదరాబాద్‌లో జూనియర్ ఎన్టీఆర్‌ని కలిసి ట్రిపులార్ సినిమాలో నటించిన తీరుపై పొగడ్తలు కురిపించారు. ఇప్పుడు ఆ సమావేశం మరొకసారి సోషల్ మీడియాలో చర్చకు దారి తీస్తోంది. అప్పుడు తారక్‌ను అమిత్ షా కలవగానే అంతా ఆ సమావేశం వెనుక ఏదో రాజకీయ కోణం ఉంది అంటూ ప్రచారాలు చేశారు. జూనియర్ ఎన్టీఆర్ ను తమ ప్రచారకర్తగా వాడుకునేందుకు ప్రయత్నిస్తున్నారా? అందుకే కలుస్తున్నారా? అంటూ పలు ప్రశ్నలు లేవనెత్తారు. అయితే ఆ మీటింగ్ తర్వాత అలాంటి విషయం ఏమీ లేదని క్లారిటీ ఇచ్చారు. Waiting For ur speech@tarak9999 Annaya ❤️❤️#NTRForBramhastra pic.twitter.com/rwwjjucvQ7 — _ (@SaiMsdian7_9999) September 2, 2022 అయితే ఇప్పుడు మళ్లీ అప్పటి ఫొటోలు వైరల్ కావడం వెనుక రాజకీయం కోణం లేదులెండి. తారక్ ట్రాన్స్ ఫర్‌మేషన్ విషయంలో ఇప్పుడు జోరుగా చర్చ సాగుతోంది. తాజాగా తారక్ ఫొటోస్ కొన్ని నెట్టింట వైరల్ గా మారాయి. ఆగస్ట్ 22న రోజున దిగిన పిక్స్ ని ఇప్పటి తాజా ఫొటోలతో పోల్చి చూసి ప్రేక్షకులు, ఫ్యాన్స్ అంతా ఆశ్చర్యపోతున్నారు. ఆ తారక్ ఈ తారక్ ఒక్కరేనా అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు. ఎందుకంటే అప్పటికీ ఇప్పటికీ జూనియర్ ఎన్టీఆర్ అంతలా మారిపోయాడు. It was a pleasure meeting you and having a delightful interaction @AmitShah ji. Thanks for the kind words. https://t.co/Hrn33EuRJh — Jr NTR (@tarak9999) August 21, 2022 జూనియర్ ఎన్టీఆర్ ఎంతో స్లిమ్‌గా కనిపిస్తున్నాడు. అంతేకాకుండా గడ్డం కూడా తీసేయడంతో ఇన్నాళ్ల నుంచి ఉన్న లుక్ ఒక్కసారిగా మారిపోయినట్లు అయ్యింది. మరీ బాగా మారిపోయినట్లు కనిపిస్తున్నాడు. ప్రస్తుతం తారక్ ఫ్యాన్స్ అప్పటి పిక్స్ ఇప్పటి పిక్స్ ను షేర్ చేస్తూ తమ ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని పంచుకుంటున్నారు. అన్నా ఏంటి ఇంతలా మారిపోయావ్.. 12 రోజులకే ఇంత మార్పా? అంటూ ప్రశ్నిస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ వైరల్ పిక్స్, ట్రాన్స్ ఫర్‌మేషన్ పై మీ అభిప్రాయాలను కూడా కామెంట్స్ రూపంలో తెలియజేయండి. Transformation Back To ASVR Look 10 Days lo ela bro asalu @tarak9999 #NTRForBrahmastra pic.twitter.com/iTLRwfJQn5 — Auto Ram Prasad (@RamPrasadAuto) September 2, 2022 ఇదీ చదవండి: ప్రేక్షకులకు గుడ్ న్యూస్.. సినిమా ఏదైనా టికెట్ రేట్ రూ.75 మాత్రమే ఇదీ చదవండి: ప్రముఖ నటికి 4 గంటల పాటు సర్జరీ.. ఎందుకంటే..?