చిన్మయి శ్రీపాద.. సంగీత ప్రియులకు పరిచయం అక్కర్లేని పేరు. సింగర్ గా, డబ్బింగ్ ఆర్టిస్టుగా ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు సంపాందించింది. ఓ వైపు వృతిపరంగా బిజిగా ఉంటూనే సమాజంలో, ముఖ్యంగా సినీ పరిశ్రమంలో మహిళలకు జరుగుతున్న అన్యాయాలపై గట్టిగా ప్రశ్నిస్తుంది చిన్మయి. ఇండస్ట్రీలో ముక్కుసూటి మనిషిగా నిలిచింది. చిన్మయి సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. ఈమెకు సోషల్ మీడియాలో ఫుల్ ఫాలోయింగ్ ఉంది. తాజాగా చిన్మయి పెట్టిన ఓకే ఒక్క పోస్టుతో ఇన్స్‌స్టాగ్రామ్‌పై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. పురుషాంగం ఫోటోలు, పిచ్చి పిచ్చి కామెంట్లు పెట్టేవారి సంగతి వదిలేసి నన్ను టార్గెట్ చేస్తారా? అంటూ ఇన్ స్టా పై ఆమె ఫైర్ అయ్యింది. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఆరోగ్యం విషయంలో, బ్యూటీ విషయంలో నిత్యం ఏదో ఒక టిప్ చెబుతూనే ఉంటుంది చిన్మయి. అయితే ఆమెకు కొందరు సపోర్టుగా ఉండంగా మరికొందరు ఆమెకు వ్యతిరేకంగా బాగా ట్రోల్స్ చేస్తుంటారు. చాలావరకు ఆమెను టార్గెట్ చేస్తూ ఫోటోలను కూడా పింపిస్తూ ఉంటారు. అలాంటి వారికి చిన్మయి అదిరిపోయే కౌంటర్లు ఇచ్చేది. ఈక్రమంలో తాజాగా ఆమె ఇన్ స్టా గ్రామ్ పై ఫైర్ అయింది. కారణం.. ఇన్ స్టా గ్రామ్ తన ఖాతను బ్లాక్ చేసింది. ఈ కారణంగా తనకు మెసేజ్ చేసిన వారికి కూడా రిప్లేఇవ్వలేకపోతుంది. దీంతో కమ్యూనిటీ గైడ్ లైన్స్ కు వ్యతిరేకంగా తాను పోరాడుతానని తెలిపింది.
ఇదీ చదవండి: అరియానా- యాంకర్ శివ మాస్ స్టెప్పులు.. వీడియో వైరల్!ఈ విషయాన్ని కూడా తన ఇన్ స్టా ద్వారానే పంచుకుంది. తనకు అసభ్యకరమైన ఫోటోలు పంపించే వ్యక్తుల ఖాతాలు యాక్టివ్ గా ఉంచి.. తన ఖాతా మాత్రం బ్లాక్ చేశారు అని ఫైర్ అయ్యింది. దీంతో చిన్మయి అకౌంట్ ని ఇలా బ్లాక్ చేయడంతో నెటిజన్లు ఇన్ స్టాగ్రామ్ పై బాగా ఫైర్ అవుతున్నారు. మరి.. ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.