గతకొంత కాలంగా సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. నటీనటులు, దర్శక, నిర్మాతలు.. ఇతర సాంకేతిక విభాగానికి చెందిన వారు వరుసగా కన్నుమూస్తున్నారు. ఈ క్రమంలో ప్రముఖ బాలీవుడ్ సింగర్ కన్నుమూయడంతో ఇండస్ట్రీ ఒక్కసారిగా మూగబోయింది.
బాలీవుడ్ ఇండస్ట్రీలో తన హెవీ బేస్ గాత్రంతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆయన.. కొంతకాలం నుండి ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు ఆయన భార్య, గాయని మిథాలీ సింగ్ తెలిపారు. ప్రస్తుతం భూపీందర్ సింగ్ వయసు 82 సంవత్సరాలు. ఆయన అంత్యక్రియలకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ప్రస్తుతం సింగర్ భూపీందర్ సింగ్ మరణవార్తతో బాలీవుడ్ ఇండస్ట్రీతో పాటు దేశవ్యాప్తంగా సంగీత ప్రియులు, ఆయన ఫ్యాన్స్ ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యారు.
కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ సాంగ్స్ ఆలపించిన భూపీందర్ సింగ్ కి ఎంతో మంది అభిమానులు ఉన్నారు. ఆయన మరణంతో బాలీవుడ్ ఇండస్ట్రీలో విషాద ఛాయలు నెలకొన్నాయి. ఆయన పాడిన పాటలు ఎన్నో చిరస్మరణీయంగా మిగిలిపోయాయి. లెజెండరి గాయకుడు భూపీందర్ సింగ్ మృతి పట్ల మీ సంతాపాన్ని కామెంట్స్ లో తెలియజేయండి.
Famous singer Bhupinder Singh passed away at the age of 82 in Mumbai, he was ailing for a long time. He was admitted to the hospital for the last 9 days and died late this evening due to a heart attack, says his wife Mithali Singh
— ANI (@ANI) July 18, 2022