సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ల పర్సనల్ విషయాలను తెలుసుకునేందుకు ఫ్యాన్స్ ఎల్లప్పుడూ ఆసక్తి చూపుతుంటారు. తాజాగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోయిన్ బ్రేకప్ వార్తలపై వెరైటీగా రియాక్ట్ అయింది. ‘సాహో’తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది శ్రద్ధా కపూర్. ఈ భామ కొంతకాలంగా ఫొటోగ్రాఫర్ రోహన్ శ్రేష్ఠతో ప్రేమలో ఉందని.. తాజాగా బ్రేకప్ చెప్పిందనే వార్త అటు సినీ ఇండస్ట్రీలో, ఇటు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.
మరి ఇంతకీ శ్రద్దా లవ్ ఎందుకు బ్రేకప్ అయ్యింది? ఆమె ఎలా రియాక్ట్ అయ్యింది? ఇది నిజమా కాదా? అనేది చర్చనీయాంశంగా మారాయి. బాలీవుడ్ లో సూపర్ జోడి అనిపించుకున్న జంటలలో శ్రద్దా, రోహన్ కూడా ఉన్నారు. గతేడాది కాలంగా ఇద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. కానీ ఈ విషయాన్ని ఇదివరకే శ్రద్దా తండ్రి శక్తికపూర్ ఖండించారు. అయితే.. శక్తి కపూర్ అలా రియాక్ట్ అయ్యేసరికి రోహన్ – శ్రద్దా మధ్య ఏం జరిగింది? లవ్ బ్రేకప్ అయ్యిందా అనే పుకార్లు వైరల్ అయ్యాయి.
ఈ క్రమంలో శ్రద్దా లవ్ బ్రేకప్ వార్తలపై శ్రద్దా వెరైటీగా రియాక్ట్ అయ్యింది. అసలు ఏమి మాట్లాడకుండా.. సైలెంట్ గా ఓ ఫోటో షేర్ చేసింది. ఇంస్టాగ్రామ్ లో శ్రద్దా సెల్ఫీ షేర్ చేసి.. ‘ఇంకా చెప్పండి వింటాను’ అన్నట్లుగా హిందీలో కాప్షన్ జోడించింది. ప్రస్తుతం శ్రద్దా పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి లవ్ బ్రేకప్ వార్తలపై శ్రద్దా రియాక్ట్ అయిన విధానం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.