Shraddha Das: ‘‘సిద్ధు ఫ్రమ్ శ్రీకాకుళం’’ సినిమాతో వెండి తెరపై అడుగు పెట్టారు శ్రద్ధాదాస్. కెరీర్ ప్రారంభం నుంచి ఇప్పటి వరకు ఐదు భాషల్లో 30కిపైగా సినిమాలు చేశారు. గుర్తింపుకు తగ్గ స్థాయిలో మంచి అవకాశాలు రాలేదు. లీడ్ రోల్స్ కంటే ఎక్కువ సెకండ్ లీడ్ రోల్లోనో.. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానో సినిమాలు చేశారు. ప్రస్తుతం అడపాదడపా సినిమాలతో తెలుగు తెరపై తళుక్కన మెరిసి వెళ్లిపోతున్నారు. అప్పుడప్పుడు బుల్లితెరపై కూడా దర్శనమిస్తున్నారు.
ప్రస్తుతం ఓ ప్రముఖ ఛానల్లో ప్రసారమవుతున్న ‘ ఢీ’ 14 డ్యాన్స్ షోకు ఓ జడ్జిగా వ్యవహరిస్తున్నారు. ఈ షోకు శ్రద్ధాదాస్ తీసుకునే రెమ్యూనరేషన్‌కు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆమె ఢీ షోకోసం రెండు ఎపిసోడ్లకు 7 లక్షల రూపాయలు తీసుకుంటోందని సమాచారం. అంటే ఒక్కో ఎపిసోడ్‌కు అక్షరాలా మూడున్నర లక్షల రూపాయలు. ఒక రోజులో రెండు ఎపిసోడ్లకు సంబంధించిన షూటింగ్ పూర్తయితే గనుక.. ఆ రోజుకు 7లక్షలు ఆమెకు అందుతాయన్న మాట. రోజుకు ఏడు లక్షలు అంటే పెద్ద మొత్తమే.
వెండి తెరపై అంతగా అవకాశాలు లేకపోయినా.. బుల్లి తెరపై వచ్చిన అవకాశాలను మాత్రం శ్రద్ధా చక్కగా వాడుకుంటున్నారు. ఇక, ఈ బొంబాయ్ ముద్దుగుమ్మ సోషల్‌మీడియాలో చాలా యాక్టీవ్‌గా ఉంటారు. వీలు చిక్కినప్పుడల్లా అభిమానులతో ఇంటరాక్ట్ అవుతుంటారు. తరచుగా తన కొత్త కొత్త ఫొటో షూట్లకు సంబంధించిన పిక్స్‌ను షేర్ చేస్తూ ఉంటారు. అవి కాస్తా వైరల్‌గా మారుతు ఉంటాయి. మరి, శ్రద్ధాదాస్ రెండు ఎపిసోడ్లకు 7 లక్షల రూపాయల పారితోషికం తీసుకుంటున్నారన్న వార్తలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : వీడియో: స్టేజ్‌పై రీతూ చౌదరి ఎమోషనల్.. తాను ఏడ్చి అందరినీ ఏడిపించేసింది!