మా ఎన్నికల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన నటి హేమపై క్రమశిక్షణ సంఘం చర్యలు తీసుకుంది. మా అధ్యక్షుడు నరేష్‌పై హేమ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దీంతో వెంటనే స్పందించిన మా క్రమ శిక్షణ హేమకు షోకాజ్ నోటీసులు పంపింది. మా ఎన్నికలు జరగకుండా అధ్యక్షుడు అడ్డుపడుతున్నాడని, మా నిధులను దుర్వినియోగం చేశారంటూ విమర్శలు గుప్పించింది. దీంతో హేమ చేసిన వ్యాఖ్యల పట్ల మా ప్యానెల్ అంతా నిర్ణయం తీసుకుని వివరణ ఇవ్వాల్సింది కోరుతూ నోటీసులు పంపారు.
ఇక మా ఎన్నికల పోరులో ప్రకాష్ రాజ్, మంచు విష్ణు, సీవీఎల్ నరసింహన్, జీవితా రాజశేఖర్, హేమ వంటి నటులు పోటీలో ఉన్నారు. దీంతో ఒక్కొక్కరు పోటీలో ఉన్నామంటూ ప్రకటించారు. అందరికంటే ముందుగానే ప్రకాష్ రాజ్ ఏకంగా తన ప్యానెల్‌ను లీస్ట్‌ను కూడా విడుదల చేసి కాస్త హీట్ పెంచాడు. హోరోహోరిగా సాగనున్న ఈ పోరులో ఎన్నికల వేడి రాజుకుంటోంది. దీంతో అప్పట్లో లోకల్, నాన్ లోకల్ అంశం కూడా తెరమీదకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఈ అంశంపై సీని నటులు భిన్న వాదనలు వినిపిస్తున్నారు. కొందరు ప్రకాష్ రాజ్‌కు అనుకూలంగా మాట్లాడితే మరి కొందరు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. ఇక రానున్న మా ఎన్నికల్లో ఇంకా ఎలాంటి విషయాలు తెరమీదకు రానున్నాయో చూడాలి మరి.