బాలీవుడ్ ని కుదిపేసిన డ్రగ్స్ కేసులో అక్టోబరు 3న షారూక్ ఖాన్ తనయుడు ఆర్యన్‌ను ఎన్సీబీ అధికారులు అరెస్టు చేశారు. ఆ తర్వాత కోర్టులో హాజరుపర్చగా.. అతడికి జ్యుడీషియల్ కస్టడీ విధిస్తూ అక్టోబరు 7న ముంబయి ప్రత్యేక న్యాయస్థానం తీర్పు వెలువరించింది. దీంతో ఆ మరుసటి రోజు ఆర్యన్‌ను ఆర్థర్ రోడ్ జైలుకు తరలించారు. ఈ కేసులో బెయిల్ కోసం ఆర్యన్ దరఖాస్తు చేసుకోగా.. ప్రత్యేక న్యాయస్థానం అందుకు తిరస్కరించింది. దీంతో ఆర్యన్ తరఫున న్యాయవాదులు బాంబే హైకోర్టును ఆశ్రయించారు.
అక్టోబరు 26న ఈ పిటిషన్‌పై ఉన్నత న్యాయస్థానం విచారణ మొదలుపెట్టింది. మొత్తానికి బాలీవుడ్‌ను కుదిపేసిన క్రూజ్ నౌక డ్రగ్స్ కేసు వ్యవహారంలో అరెస్టయిన ప్రముఖ నటుడు షారుక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ ఎట్టకేలకు జైలు నుంచి విడుదలయ్యాడు. డ్రగ్స్ కేసులో అరెస్టై 22 రోజులపాటు జైలు జీవితం గడిపిన అనంతరం షారుక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ స్వగృహానికి చేరుకున్నాడు. తన తనయుడు ఆర్యన్ ఖాన్ జైలుకు వెళ్లడంతో దాదాపు నెలరోజుల పాటు కంటిమీద కునుకులేకుండా ఉన్న షారుఖ్ ఖాన్ ఇప్పుడు కాస్తా ప్రశాంతంగా ఉన్నట్లు కనిపిస్తోంది.
షారూక్ ఖాన్ తన పుట్టినరోజు సందర్భంగా కుటుంబసభ్యులు, మిత్రులతో కలిసి ఎంజాయ్ చేసిన ఆయన.. దుబాయ్ నుంచి అద్భుతమైన స్పెషల్ విష్ అందుకున్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద భవనమైన బుర్జ్ ఖలీఫాపై ‘హ్యాపీ బర్త్ డే షారుఖ్ ఖాన్.. వి లవ్ యూ’ అంటూ కలర్‌ఫుల్ లైట్స్‌తో తన స్నేహితుడు మొహమ్మద్ అలబ్బర్ ఈ సర్ప్రైజ్ ఇవ్వగా.. షారుఖ్ ట్విట్టర్లో థాంక్స్ చెప్పాడు. ప్రపంచంలోని అతిపెద్ద, ఎత్తైన స్క్రీన్‌పై తనను చూసుకోవడం ఆనందంగా ఉందన్నారు.
Happy birthday @iamsrk from the @noon family
كل عام وأنت بخير @iamsrk من عائلة نون pic.twitter.com/TIG3zURQjk
— Mohamed Alabbar محمد العبار (@mohamed_alabbar) November 2, 2021