భారత పారిశ్రామిక దిగ్గజం ముకేశ్ అంబానీ తన భార్య నీతా అంబానీ కోరిక మేరకు ఓ అద్భుతమైన కట్టడాన్ని నిర్మించి.. కానుకగా అందించాడు. ఈ భవనం ప్రారంభోత్సవం కన్నుల పండుగగా జరిగింది. ఈ ప్రారంభోత్సవ వేడుకలకు రాజకీయ, క్రీడ, సినీ, పారిశ్రామికవేత్తలెందరో తరలివచ్చారు.
‘రాజు తలచుకుంటే దెబ్బలకు కొదవా అన్నట్లుగా.. అంబానీ తలచుకుంటే ఏదైనా సాధ్యమే..’ ఈ విషయం అందరికీ తెలుసు. దేశంలోనే అత్యంత సంపన్నుడు, భారత పారిశ్రామిక దిగ్గజం ముకేశ్ అంబానీ తన భార్య నీతా అంబానీ కోరిక మేరకు ఓ అద్భుతమైన కట్టడాన్ని నిర్మించి.. కానుకగా అందించాడు. దేశం మొత్తం ఆ భవనం వైపే చూసేలా.. అందంగా ఆ భవనాన్ని తీర్చిదిద్దారు. ఈ భవనం ప్రారంభోత్సవానికి దేశంలోని రాజకీయ, సినీ, క్రీడా, పారిశ్రామిక ప్రముఖులందరూ ముంబైలో వాలిపోయారంటే నమ్మండి. ఈ భవనం ప్రారంభోత్సవం కోలాహలంగా జరిగింది. ఇంతకీ ఆ భవనం ఏంటి..? దీని ప్రత్యేకతలు ఏంటి..? నీతా అంబానీ దీన్ని ఎందుకు నిర్మించాలనుకున్నారు..? అన్నది ఇప్పుడు తెలుసుకుందాం..
రిలయన్స్ ఫౌండేషన్ ఛైర్‌పర్సన్ నీతా అంబానీ ఏది చేసినా అందులో ప్రత్యేకత తప్పక ఉండి ఉంటుంది. ఈ క్రమంలోనే ఆమె దేశ కళారంగాన్ని, సాంస్కృతిక వైభవాన్ని, సంప్రదాయ కళలను ప్రోత్సహించడంలో భాగంగా ఓ కల్చరల్ సెంటర్ నిర్మించాలనుకున్నారు. ఆ ప్రతిరూపమే ఈ భవనం. ఆర్థిక రాజధాని ముంబైలోని జియో వరల్డ్ సెంటర్ లో సరికొత్తగా.. అత్యంత విశాలంగా ఈ కల్చరల్ సెంటర్ ను నిర్మించారు. ఈ భవనానికి అంబానీ తన భార్య నీతా అంబానీ(నీతా ముఖేశ్ అంబానీ కల్చరల్ సెంటర్) పేరును నామకరణం చేశాడు. దేశంలోనే అతి పెద్ద సాంస్కృతి కేంద్రంగా ఈ కట్టడం నిలువనుంది.
శ్రీరామనవమి పర్వదినాన నీతా అంబానీ ఒక రోజు ముందే ఈ కల్చరల్ సెంటర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శుక్రవారం ఈ కల్చరల్ సెంటర్‌ను అధికారికంగా అట్టహాసంగా ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవ వేడుకలకు రాజకీయ, క్రీడ, సినీ, పారిశ్రామికవేత్తలెందరో తరలివచ్చారు. క్రికెట్ దిగ్గజం సచిన్ టెందూల్కర్, ఆయన సతీమణి అంజలి, కూతురు సారా, ఒలింపిక్ బంగారు పతక విజేత అభినవ్ బింద్రా, టెన్నిస్ స్టార్ సానియా మీర్జా, అథ్లెట్ దీపా మాలిక్, బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్, ఆయన సతీమణి గౌరీ ఖాన్, సల్మాన్ ఖాన్, సిద్ధార్థ్-కియారా అడ్వాణీ, దీపికా పదుకొణె-రణ్‌వీర్ సింగ్, ప్రియాంకా చోప్రా-నిక్ జొనాస్, ఐశ్వర్యరాయ్, రజనీకాంత్, ఆయన కుమార్తె సౌందర్య, సైఫ్ అలీఖాన్-కరీనా కపూర్, ఆమిర్ ఖాన్, కరణ్ జోహార్, షాహిద్ కపూర్ తదితర ప్రముఖలందరూ ఈ ప్రారంభోత్సవ వేడుకల్లో పాల్గొని సందడి చేశారు. అందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉన్నాయి.
Sachin Tendulkar makes a grand entrance with wife Anjali & daughter Sarah at NMACC launch event #sachintendulkar #sarahtendulkar #mumbai #mukeshambani #NMACC #nmacclaunch #nitaambani #nitamukeshambaniculturecentre pic.twitter.com/HhrYEBCEOm
— News18 (@CNNnews18) March 31, 2023
#WATCH | Mumbai: Nita Ambani gracefully dances on ‘Raghupati Raghava Raja Ram’ at Nita Mukesh Ambani Cultural Centre (NMACC) pic.twitter.com/ndCKYdvvj1
— ANI (@ANI) April 1, 2023
#NitaMukeshAmbaniCulturalCentre #Thalaivar along with daughter @soundaryaarajni #தலைவர் #Thalaivar #Superstar #Rajinikanth #ரஜினிகாந்த் #RajinikanthArmy @rajinikanth @officialairrm pic.twitter.com/0Ko2hqOpGK
— Rajinikanth Army (@RajinikanthArmy) March 31, 2023