బాలీవుడ్ లో ఎలాంటి బ్యాగ్ గ్రౌండ్ లేకుండా స్వయంకృషితో పైకి వచ్చిన హీరో షారూఖ్ ఖాన్. కేవలం నటుడిగానే కాకుండా యాంకర్ గా తన సత్తా చాటుతున్నాడు. ఇటీవల షారూఖ్ నటించిన చిత్రాలు పెద్దగా ఆకర్షించకపోయినా.. ఆయన క్రేజ్ ఏమాత్రం తగ్గడం లేదు. షారూఖ్ ఖాన్ సతీమణి గౌరీఖాన్. వీరికి ఇద్దరు కుమారులు ఒక కూతురు ఉంది. ఇటీవల షారూఖ్ తనయుడు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసు విషయం సంచలనం సృష్టించింది. షారూఖ్ ఖాన్ కూతురు సుహానా ఖాన్ కి సంబంధించిన వార్తలు అప్పడప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంటాయి.
సినీ ఇండస్ట్రీలోకి త్వరలో సుహానా అడుగు పెట్టబోతున్నట్లు బీ టౌన్ లో తెగ వార్తలు వస్తున్నాయి. ఇక సుహానా కి సంబంధించిన ఫోటో షూట్స్ కుర్రాళ్ల మతులు పోగొడుతుంటాయి. బాలీవుడ్ స్టార్ హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోకుండా సుహానాకు ఫాలోయింగ్ కూడా ఎక్కువే ఉంది. ఇటీవల బాలీవుడ్ లో స్టార్ హీరో, హీరోయిన్ల వారసులు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వడంపై పలు వివాదాలు చెలరేగాయి. స్టార్ కిడ్స్ కి నటన రాకున్నా బ్యాగ్ గ్రౌండ్ పై ఆధాపడి జీవిస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో సుహానా ఖాన్ తన సొంత టాలెంట్ తో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వాలనుకుంటుంది. ఇప్పటికే నటనలో శిక్షణ కూడా తీసుకుంటున్నట్లు సమాచారం. తాజాగా ఈ అమ్మడు చీర కట్టులో ఉన్న ఒక వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. మనీష్ మల్హోత్రా ఇచ్చిన దీపావళి పార్టీలో కుటుంబ సభ్యులతో పాటు సుహానా ఖాన్ కూడా పాల్గొంది. ఎంత మంది ప్రముఖులు ఉన్నా.. అందులో సుహానా ఎంతో ప్రత్యేకంగా కనిపించింది. లైట్ బంగారు వర్ణంతో ఉన్న డిజైన్ చీరకట్టుతో ట్రెడిషినల్ గా కనిపించింది.
ఈ చీర కట్టులో చూస్తుంటే కుర్రాళ్ల మతులు పోతున్నాయని కామెంట్స్ వినిపిస్తున్నాయి. సుహానా ఖాన్ హీరోయిన్ గా ఈ సంవత్సరం కాకున్నా.. వచ్చే ఏడాది మంచి సబ్జెక్ట్ తో రావొచ్చని అభిమానులు అనుకుంటున్నారు. చీరకట్టులో కూడా తన నడుం అందాలు.. వంపు సొంపులు చూస్తున్న సుహానాని చూస్తుంటే ఎప్పుడెప్పుడు హీరోయిన్ గా తమకు దర్శనం ఇస్తుందా అని ఎదురు చూస్తున్నారు అభిమానులు. ప్రస్తుతం సుహానా ఖాన్ చీర కట్టు అందాలు.. సోయగాలకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది.