Srivani: తెలుగు టీవీ సీరియల్స్ చూసే వారికి పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు ‘శ్రీవాణి’. చంద్రముఖి సీరియల్‌లో నటనతో తనకంటూ ఓ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. మనసు మమత, కలవారి కోడలు, కాంచన గంగ, మావి చిగురు, ఘర్షణ వంటి సీరియల్స్‌తో ప్రేక్షకుల మందుకు వచ్చారు. కొన్ని టీవీ షోలు, యాడ్స్‌తో పాటు సినిమాల్లో కూడా నటించారు. నలుగురితో కలిసిపోయి ఎంతో చక్కగా మాట్లాడే శ్రీవాణి ఓ అరుదైన బారిన పడింది. ఎప్పుడూ గలగలా మాట్లాడే ఆమె మాట కోల్పోయింది. ఈ విషయాన్ని ఆమె భర్త స్వయంగా తమ యూట్యూబ్ ఛానల్‌లో చెప్పుకొచ్చారు.
ఆయన మాట్లాడుతూ.. ‘‘ మొదట దాన్ని జలుబు అనుకున్నాం. కొన్ని మందులు వాడాం. రోజురోజుకు పెరిగింది. గత వారం రోజులనుంచి కంప్లీట్‌గా తన వాయిసే పోయింది. మాట్లాడలేకపోతోంది. మాట్లాడటానికి కూడా రావటం లేదు. మాకు చాలా భయంగా ఉంది. కానీ, ఏమీ కాదు డెఫినెట్‌గా. తనను చూస్తుంటే చాలా బాధగా ఉంది. డాక్టర్ దగ్గరకు వెళ్తే.. గట్టిగా అరవటం కారణంగా గొంతులోపలి టిష్షు వాపునకు గురైందని చెప్పాడు.
కొన్ని మందులిచ్చాడు. నెల రోజుల వరకు తను అస్సలు మాట్లాడకూడదని చెప్పాడు. మాట్లాడితే సమస్య వస్తుందన్నాడు. నెల తర్వాత ఆమె మళ్లీ నార్మల్ అవుతుందన్న నమ్మకం ఉంది’’ అని చెప్పాడు. శ్రీవాణి మాట కోల్పోవటంపై ఆమె అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆమె త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు. మరి, శ్రీవాణి మాట త్వరగా తిరిగి రావాలని కోరుకుంటూ మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : RC15 Movie Shooting: చరణ్ సినిమా షూటింగ్‌ను అడ్డుకున్న బీజేపీ నేతలు.. ఎందుకంటే?