Uday Kiran: “చిత్రం” సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి హీరోగా పరిచయం అయ్యారు ఉదయ్ కిరణ్. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చిన ఈ హీరో సంచలన విజయాలతో ఒకనొక దశలో స్టార్ హీరోగా మారిపోయాడు. పెద్ద హీరోలకు కూడా సాధ్యం కాని రికార్డులను కేవలం మూడు సినిమాలతో అందుకుని అద్భుతాలు చేశాడు. అనంతరం కొన్నాళ్లకి కెరియర్ లో ఒడిదుడుకులను భరించలేక ఉదయ్ కిరణ్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయన ఆత్మహత్యకు గల కారణాలు ఒక్కొక్కరు ఒక్కో విధంగా చెబుతారు. ఎవరు ఎన్ని కారణాలు చెప్పిన వాస్తవం ఏమిటనే ఉదయ్ కి మాత్రమే తెలుసు.
తాజాగా సీనియర్ నటి సుధ.. ఉదయ్ కిరణ్‌తో తనకున్న అనుబంధాన్ని ఓ మీడియా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. సుధ మాట్లాడుతూ.. ‘‘ ఉదయ్ కిరణ్ చిన్నతనంలోనే తల్లిని కోల్పోయాడు. తర్వాత తండ్రికి దూరమయ్యాడు. ఏదో తెలియని ఒంటరి తనంలో బతికాడు. నేను కూడా అలాంటి పరిస్థితులనే ఎదుర్కొన్నాను. నాలాంటి పరిస్థితుల్లో ఉన్న ఉదయ్‌ని చూసినప్పుడు దేవుడు ఇచ్చిన బిడ్డగా భావించేదాన్ని. నేను ఉదయ్ కిరణ్‌ను దత్తత తీసుకోవాలనుకున్నాను. కోర్టులో దానికి సంబంధించిన పేపర్స్ అన్నీ సబ్‌మిట్ చేశాం. మూడు నాలుగు నెలల సమయం ఉండింది.
కోర్టు నుంచి ఆర్డర్ వస్తే దత్తత తీసుకోవచ్చు. ఈ లోపే అతడు మమ్మల్ని దూరం పెడుతూ వచ్చాడు. ఉదయ్ కిరణ్ తను పెళ్లి చేసుకోబోయే సంగతి కూడా నాకు చెప్పలేదు. పెళ్లికి పత్రిక పంపించాడు. కానీ, నేను బిజీగా ఉండి, వేరే కారణాల వల్ల వెళ్లలేకపోయాను. వెళ్లుంటే బాగుండేదని ఇప్పుడు అనిపిస్తోంది. ఉదయ్ కిరణ్ ఓ రోజు నన్ను కలవడానికి వచ్చాడు. షూటింగ్ స్పాట్ దగ్గర నా హెయిర్ డ్రెస్సర్‌తో అమ్మతో మాట్లాడాలని అడిగాడు. తను వచ్చి నా దగ్గర ఉదయ్ వచ్చిన విషయం చెప్పాడు.
‘వాడు నా దగ్గర రావటానికి అడగాలా ఏంట్రా! రమ్మను వాడిని’ అన్నాను. నేను కుర్చీలో కూర్చుని ఉన్నాను. పక్కనే చలపతి రావుగారున్నారు. రావటం రావటం నా కాళ్లు పట్టుకుని గట్టిగా ఏడ్చాడు. ఆ ఏడుపుని ఇప్పటికీ మరచిపోలేకపోతున్నాను. తనతో ఏదో జన్మలో అనుబంధం ఉండి ఉంటుందేమో అది ఇలా తీర్చేసి వెళ్లిపోయాడు’’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. మరి, ఉదయ్ కిరణ్‌తో సుధ అనుబంధంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : Nikhil Siddharth: కార్తికేయ 2 సినిమాలో ఆ సీన్‌కి పవన్ కళ్యాణే ఆదర్శం: నిఖిల్