టాలీవుడ్ టాప్ కొరియోగ్రాఫర్లలో శేఖర్ మాస్టర్ ఒకరు. తెలుగు ప్రేక్షకులకు ఈయన గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. అనేక మంది స్టార్ హీరోలకి కొరియోగ్రఫీ చేశారు. మరొవైపు బుల్లితెరపై కూడా పలు షోల్లో ఎంట్రీ ఇచ్చి మంచి క్రేజ్ సంపాందించాడు. బుల్లితెర ప్రేక్షకుల్లో శేఖర్ మాస్టర్ కి ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందంటే అతిశయోక్తి కాదు. శేఖర్ మాస్టర్ కి సాహితీ, విన్ని అనే ఇద్దరు పిల్లలు. వీరు కూడా మంచి డ్యాన్సర్లు. గతంలో పలు షోల్లో అదిరిపోయే డ్యాన్స్ చేసి అందరిని ఆకట్టుకున్నారు. వీరిద్దరు కూడా భవిష్యత్తులో గొప్ప డ్యాన్సర్ల అవుతారని కొందరు అభిప్రాయాపడ్డారు. తాజాగా శేఖర్ మాస్టర్ కూతురు సాహితి గురించి ఓ టాక్ వినిపిస్తోంది. ఆమె త్వరలో హీరోయిన్ గా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వనున్నారని టాక్ వినిపిస్తోంది.
శేఖర్ మాస్టర్ కుమార్తె సాహితికి సోషల్ మీడియాలో చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. శేఖర్ మాస్టర్ కుమార్తెగానే పరిచయమైనా తన డాన్స్ తో టిక్ టాక్ వీడియోలతో సాహితి కూడా మంచి పేరు సంపాదించింది. చూడటానికి చక్కగా కుందనపు బొమ్మలా ఉండే ఆమె హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వడం కోసం రంగం సిద్ధమైందని తెలుస్తోంది. ఈ విషయంలో ఇప్పటికే ఓ కొత్త దర్శకుడు.. శేఖర్ మాస్టర్ , సాహితీ లకు కథ చెప్పారని, అది వారికి నచ్చడంతో శేఖర్ మాస్టర్ డైరెక్టర్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని టాక్. అయితే డైరెక్టర్ కొత్తవాడు అయినా మంచి క్రేజ్ ఉన్న యంగ్ హీరోను సినిమాలో భాగం చేసేందుకు శేఖర్ మాస్టర్ ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం.
శేఖర్ మాస్టర్ ఇండస్ట్రీలో తన పరిచయాలను ఉపయోగించి మీడియం రేంజ్ హీరోలకు దర్శకుడి చేత కథ చెప్పిస్తున్నారని టాలీవుడ్ లో జోరుగా ప్రచారం జరుగుతోంది. నిజానికి ఇప్పటికే సాహితీ, విన్నీ ఇద్దరూ కూడా తమ యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రేక్షకులకు దగ్గరయ్యారు. గతంలో ఆమె పేరుతో ఆ మధ్య ఫేక్ ఐడీలు కూడా సృష్టించారు. వాటి విషయంలో జాగ్రత్తగా ఉండమని కూడా శేఖర్ మాస్టర్ హెచ్చరించారు. సాహితీ హీరోయిన్ గా మారే అవకాశం ఉందనే వార్త టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. మరి.. శేఖర్ మాస్టర్ కూతురు హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వనున్నారు అంటూ వస్తున్న వార్తలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.