NTR30 మూవీ షూటింగ్ ప్రస్తుతం యమ స్పీడుగా జరుగుతోంది. ఇప్పుడు ఈ చిత్రానికి ఓ కష్టం వచ్చినట్లు సోషల్ మీడియాలో న్యూస్ వైరల్ అవుతోంది. ఇంతకీ ఏం జరిగింది?
ఒకప్పుడు హీరోలు, విలన్స్ సెపరేట్ గా ఉండేవారు. ఇప్పుడు ట్రెండ్ పూర్తిగా మారిపోయింది. హీరోలు విలన్స్ అవుతున్నారు. విలన్స్ హీరోలు అయిపోతున్నారు.స్టైల్ గా ఉండే ప్రతినాయకుడి కోసం దర్శకనిర్మాతలు తెగ వెతుకుతుంటారు. రానా, విజయ్ సేతుపతి, జగపతి బాబు, ఆది పినిశెట్టి, అక్షయ కుమార్ ఇప్పటికే విలన్స్ గా చేసి సక్సెస్ అయ్యారు. ఇప్పుడు అలాంటి ఓ విలన్ వల్ల NTR30 మూవీకి కొత్త కష్టం వచ్చిందట. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇదే న్యూస్ చర్చనీయాంశంగా మారింది. ఫ్యాన్స్ దీని గురించే తెగ మాట్లాడుకుంటున్నారు.
ఇక వివరాల్లోకి వెళ్తే.. ఎన్టీఆర్ ప్రస్తుతం గ్లోబల్ స్టార్ అయిపోయాడు. ‘ఆర్ఆర్ఆర్’తో వరల్డ్ వైడ్ క్రేజ్ తెచ్చుకున్న తారక్.. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. రీసెంట్ గానే షూట్ ప్రారంభమైంది. ఫుల్ ఆన్ వయలెన్స్ స్టోరీతో దీన్ని తీస్తున్నారు. ఇందులో హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ చేస్తుండగా, విలన్ గా సైఫ్ అలీఖాన్ నటిస్తున్నాడనే ప్రచారం సాగింది. ఇందులో నిజమెంత అనేది ఇంతవరకు తెలియదు. ఇప్పుడు ఏకంగా సైఫ్ మూవీ నుంచి తప్పుకొన్నాడనే విషయం హాట్ టాపిక్ గా మారింది.
బాలీవుడ్ టాప్ హీరోల్లో ఒకరైన సైఫ్ అలీఖాన్.. ‘తాన్హాజీ’లో విలన్ గా చేసి అదరగొట్టారు. ప్రభాస్ ‘ఆదిపురుష్’లోనూ ఇతడే ప్రతినాయకుడు. ఎన్టీఆర్30లోనూ ఇతడే విలన్ అని అన్నారు. అయితే మూవీకి తొలుత గ్రీన్ సిగ్నల్ ఇచ్చినప్పటికీ ఇప్పుడు పెద్దగా ఇంట్రెస్ట్ చూపించట్లేదని సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తోంది. దీనికి పెద్దగా రీజన్ లేకపోయినప్పటికీ, సౌత్ సినిమాలకు సైన్ చేయడానికి సైఫ్ ఎందుకో ఆసక్తి చూపించట్లేదట. దీంతో కొత్త విలన్ ఎవరా అని ఫ్యాన్స్ మాట్లాడుకుంటున్నారు. ఇదిలా ఉండగా ఈ మూవీకి అనిరుధ్ సంగీతమందిస్తున్నాడు. వచ్చే ఏడాది ఏప్రిల్ 5న మూవీ రిలీజ్ అవుతుందని ఎన్టీఆర్ చాలా రోజుల క్రితమే చెప్పారు. సరే ఇదంతా పక్కనబెడితే ఎన్టీఆర్30 విలన్ కష్టాలు ఎప్పుడు తీరతాయని మీరనుకుంటున్నారు. కింద కామెంట్ చేయండి.