ప్రముఖ హీరో శింబు గతంలో నయనతార, హన్సికలతో ప్రేమ వ్యవహారం నడిపారు. ఆ ఇద్దరితోనూ ప్రేమ బెడిసికొట్టింది. కొన్నేళ్ల పాటు ప్రేమకు దూరంగా ఉన్న ఆయన మళ్లీ డేటింగ్లో పడ్డారంట. ఓ అమ్మాయిని ప్రేమిస్తున్నారట. ఆమెనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారట.
ఇండస్ట్రీలో ప్రేమ వ్యవహారాలు, బ్రేకప్‌లు సర్వసాధారణం. ఇద్దరికంటే ఎక్కువ మందితో ప్రేమలో పడ్డ సెలెబ్రిటీలు చాలా మందే ఉన్నారు. ముఖ్యంగా హీరోలు ఎక్కువ మందితో ప్రేమ వ్యవహారాలు నడిపిస్తుంటారు. టాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు ఇది సర్వసాధారణం. సౌత్‌లో సిద్ధార్ద్, శింబు.. బాలీవుడ్లో కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఈకోవకు చెందిన వారే. ప్రస్తుతం శింబుకు సంబంధించిన ఓ వార్త కోలీవుడ్ ఫిల్మ్ సర్కిల్లో చక్కర్లు కొడుతోంది. హీరో శింబు త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారన్నది ఆ వార్తల సారాంశం. ఆ వార్తల ప్రకారం.. శింబు ఓ కోటీశ్వరురాలైన అమ్మాయితో డేటింగ్లో ఉన్నారంట. శ్రీలంకకు చెందిన ఆ అమ్మాయి ప్రస్తుతం డాక్టర్ చదువుతోందట. ఆమె శింబుకు పెద్ద ఫ్యాన్ అట.
ఆమె తండ్రి వందల కోట్ల రూపాయల బిజినెస్ నిర్వహిస్తున్నారట. వీరి పెళ్లికి పెద్దలు కూడా సమ్మతం తెలిపారట. అతి త్వరలో ఇద్దరూ పెళ్లి పీటలు ఎక్కబోతున్నారట. అయితే, ఈ వార్తల్లో నిజం ఎంతుందో తెలియాలంటే.. శింబు నుంచి కానీ, ఆయన ఫ్యామిలీనుంచి కానీ, ఓ అధికారిక ప్రకటన రావాల్సిందే. కాగా, శింబు గతంలో ప్రముఖ హీరోయిన్ నయనతారతో ప్రేమ వ్యవహారం నడిపారు. తర్వాత ఇద్దరి మధ్యా భేదాభిప్రాయాలు వచ్చాయి. దీంతో ఇద్దరూ విడిపోయారు. నయనతారతో బ్రేకప్ తర్వాత శింబు మరో హీరోయిన్ హన్సిక మౌత్వానితో ప్రేమలో పడ్డారు. వీరు కొన్నేళ్ల పాటు ఘాటుగా ప్రేమించుకున్నారు. తర్వాత మనస్పర్థల కారణంగా ఇద్దరూ విడిపోయారు.
నయనతార, హన్సికలు ఎవరిదారిన వారు ప్రేమ పెళ్లిళ్లు చేసుకుని సెటిల్ అయిపోయారు. ఒంటరిగా ఉన్న శింబు కూడా ఓ ఇంటి వాడు కావాలని ఆయన ఫ్యాన్స్ దేవుడ్ని ప్రార్థిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన ప్రేమ వ్యవహారం, పెళ్లి గురించిన వార్తలు తెలిసి సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాగా, శింబు తండ్రి డి.రాజేంద్రన్ తన కుమారుడి పెళ్లి గురించి గతంలో ఓ ప్రకటన చేశారు. తన కుమారుడు అతి త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు వెల్లడించారు. మరి, శింబు పెళ్లి వార్తలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.