రుక్సార్ ధిల్లన్.. నాని హీరోగా వచ్చిన కృష్ణార్జున యుద్ధం సినిమాతో ఈ అమ్మడు తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ఆకతాయి, ఏబీసీడీ వంటి సినిమాల్లో నటించి తన అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. అయితే విశ్వక్ సేన్ హీరోగా నటించిన తాజా చిత్రం అశోక వనంలో అర్జున కళ్యాణం. షూటింగ్ పనులు ముగించుకుని ఈ మూవీ రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. అయితే ఇందులో హీరోయిన్ గా నటించింది యంగ్ బ్యూటీ రుక్సార్ ధిల్లన్. కాగా ఈ చిత్ర ప్రమోషన్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ అమ్మడు ప్రేమ పెళ్లిపై కీలక వ్యాఖ్యలు చేసింది.
ఇది కూాడా చదవండి: శ్రీముఖి పెళ్లిపై షాకింగ్ కామెంట్.. వైరల్ వీడియో!
మా కుటుంబంలో ఎక్కువగా ప్రేమ వివాహాలే జరిగాయని, నేను కూడా ప్రేమ వివాహాన్ని నమ్ముతానంటూ ఈ బామ మనసులోని మాటను బయటపెట్టింది. అరేంజ్డ్ మ్యారేజ్ వల్ల చుట్టాలంతా కలిసి మాట్లాడుకోవడం ఒక థ్రిల్‌గా వుంటుంది. రెండు కుటుంబాలు కలుసుకోవడానికి, ఆలోచనలు పంచుకోవడానికి అవకాశాలు ఉంటాయని అంటోంది ఈ సుందరి. ఇక నాకు కాబోయేవాడి లుక్స్‌కి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వనని, గౌరవప్రదంగా, మంచిగా, డౌన్ టు ఎర్త్ ఉండేలా చూసుకుంటానంటూ ఈ హీరోయిన్ తెలిపింది. ప్రేమ పెళ్లినే నమ్ముతానన్న ఈ హీరోయిన్ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.