ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం RRR హవా కొనసాగుతోంది. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ పీరియాడిక్ మల్టీస్టారర్ మూవీ.. ఇప్పుడు అన్ని దేశాలలో ఇండియన్ సినిమా సత్తాను చాటుతోంది. బాహుబలి తర్వాత రాజమౌళి రూపొందించిన సినిమా కావడంతో ట్రిపుల్ ఆర్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక అభిమానుల అన్ని అంచనాలను బీట్ చేస్తూ ట్రిపుల్ ఆర్ మూవీ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాస్తోంది.
ఇంతవరకు విదేశీ మార్కెట్ లో ఏ భారతీయ సినిమా సాధించిన కలెక్షన్లను ఆర్ఆర్ఆర్ ఖాతాలో వేసుకుంటోంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా నటించిన ఈ సినిమా చూసి విదేశీ ప్రేక్షకులు సైతం ఫిదా అవుతున్నారు. ఈ క్రమంలో తాజాగా ఓ విదేశీ ప్రేక్షకుడు RRR పై చేసిన ట్వీట్ చర్చనీయాంశంగా మారింది. ఏషియన్ సినిమాల్లో ‘ఐపీ మ్యాన్’ తర్వాత తనకు బాగా నచ్చిన సినిమా RRR యేనని, మిగతా బాలీవుడ్ సినిమాలను బ్రష్ చేయాలంటూ ట్వీట్ చేశాడు.విదేశీయుడి ట్వీట్ పై స్పందించిన ట్రిపుల్ ఆర్ టీమ్ అతనికి దిమ్మతిరిగే విధంగా సమాధానం ఇచ్చింది. ‘ఇది కేవలం ఏషియన్ సినిమా మాత్రమే కాదు.. ట్రిపుల్ ఆర్ ఒక ఇండియన్ సినిమా’ అంటూ ట్వీట్ లో మెన్షన్ చేసింది. ఈ విధంగా ట్రిపుల్ ఆర్ టీమ్.. ఆ విదేశీ ప్రేక్షకుడికి ఇండియన్ సినిమాలను వేరు చేసి చూడొద్దు అని గుర్తు చేసిందని ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.
INDIAN CINEMA* ❤️ #RRRMovie https://t.co/hSujRkHQdX
— RRR Movie (@RRRMovie) March 30, 2022