దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన పాన్ ఇండియా చిత్రం ఆర్ఆర్ఆర్. యంగ్ టైగర్ యన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నట విశ్వరూపానికి నిదర్శనం ఈ ట్రిపులార్ చిత్రం. ప్రపంచ వ్యాప్తంగా విడుదలై ఈ చిత్రం.. సృష్టించిన కలెక్షన్ల సునామీ గురించి అందరికి తెలిసిందే. భారతీయ సినిమా చరిత్రలో అనేక రికార్డులను సొంతం చేసుకుంది. సినీ ఇండస్ట్రీలో ఓ సరికొత్త బెంచ్ మార్క్ ను ఏర్పాటు చేసింది. ఇప్పటికీ థియేటర్లలో RRR దండయాత్ర కొనసాగుతోంది. ఇది ఇలా ఉంచితే సినిమాలను స్పూఫ్ గా తీసుకుని కామెడీ పండిస్తుంటారు.
గతంలో జబర్దస్త్ అనే కామెడీ ప్రోగాం లో పుష్ప సినిమా స్పూఫ్ గా చేసి ఓ రేంజ్ లో కామెడీ పండించారు. తాజాగా కామెడీ స్టార్స్ అనే షో లో RRR సినిమాను స్పూఫ్ గా చేసి కామెడీ పండిచారు. దీనికి సంబంధించిన ప్రోమోను నిర్వహకులు విడుదల చేశారు. ఇందులో ట్విస్ట్ ఏంటంటే యన్టీఆర్, రామ్ చరణ్ పాత్రల్లో చిరంజీవి, బాలకృష్ణ మ్యానరిజం తీసుకుని కామెడీ పండించారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. మీరు ఓ లుక్కేయండి.. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.