పాన్ ఇండియా సినిమాగా విడుదలవుతున్న ‘ఆర్ఆర్ఆర్’ కర్ణాటక, ఏపీ సరిహద్దులోని చిక్కబళ్లాపూర్ లో ప్రీ రిలీజ్ వేడుక జరుపుకుంటోంది. ఎన్టీఆర్, రామ్‌చరణ్ కలిసి నటించిన `ఆర్‌ఆర్‌ఆర్` చిత్రం మార్చి 25న విడుదల కాబోతుంది. దీంతో శనివారం కర్నాటకలోని చిక్కబల్లాపూర్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ని ఏర్పాటు చేశారు. భారీ స్థాయిలో ఈ వేడుకని ఏర్పాటు చేశారు. అటు నందమూరి అభిమానులు, ఇటు మెగా అభిమానులతో, మరోవైపు కన్నడ అభిమానులు, పునీత్ రాజ్‌కుమార్ అభిమానులతో `ఆర్‌ఆర్‌ఆర్` ఈవెంట్ వేడుక ప్రాంగణం మొత్తం పోటెత్తిపోయింది.
ఊహంచని విధంగా ఈ వేడుకకి మూడు రాష్ట్రాల నుంచి భారీగా అభిమానులు తరలి వచ్చారు. ‘ఆర్ఆర్ఆర్’ ప్రధానంగా తెలుగు చిత్రమే అయినా, కన్నడ గడ్డపై ప్రీ రిలీజ్ ఈవెంట్ కు హాజరైన అభిమాన జనాన్ని చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. ఇసుకేస్తే రాలనంతగా వేలాదిమంది అభిమానులు పోటెత్తారు. మరోవైపు ఎన్టీఆర్ కోసం కర్నాటక నుంచి పునీత్ రాజ్‌కుమార్ అభిమానులు కూడా భారీగా తరలి వచ్చారు.
ఇటీవల హఠాన్మరణం చెందిన కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ కు ఈ కార్యక్రమంలో ఘననివాళి అర్పించారు. కాగా, ఈ కార్యక్రమానికి దర్శకుడు రాజమౌళి, హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్, కన్నడ చిత్రసీమ నుంచి సీనియర్ హీరో శివరాజ్ కుమార్, కేవీఎన్ ప్రొడక్షన్స్ అధినేత వెంకట్ హాజరయ్యారు.