దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన మరో అద్భుతం ట్రిపులార్. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ నట విశ్వరూపానికి నిదర్శనం ట్రిపులార్. ఎన్ని భారీ చిత్రాలు వచ్చినా.. థియేటర్లలో ట్రిపులార్ సినిమా హవా నడుస్తూనే ఉంది. తాజాగా ఈ సినిమా తెలుగు సినిమా చరిత్రలోనే ఏ సినిమా అందుకోలేని రికార్డు సొంతం చేసుకుంది. సరికొత్త బెంచ్ మార్క్ ను ఏర్పాటు చేసింది. రాయలసీమలో ఏకంగా 50 కోట్ల షేర్‌ను రాబట్టి సరికొత్త రికార్డులు నెలకొల్పింది.
ఇదీ చదవండి: KGF 2 Collections: 5వ రోజూ అదిరిపోయే కలెక్షన్స్!
రాయలసీమ బాక్సాఫీస్ లో ఇప్పటివరకు ఉన్న బాహుబలి 2 ఆల్ టైమ్ రికార్డ్ రూ.34.75 కోట్ల షేర్ రికార్డును ట్రిపులార్ కేవలం వారంరోజుల్లోనే బ్రేక్ చేసింది. ఆ తర్వాత ట్రిపులార్ సరికొత్త బెంచ్ మార్కులను నెలకొల్పుతూ వెళ్లింది. 40 కోట్లు, 45 కోట్లు, ఇప్పుడు ఏకంగా 50 కోట్ల షేర్ రాబట్టి రికార్డును సృష్టిచింది. ఇంకా ట్రిపులార్ హవా రాయలసీమలో కొనసాగుతూనే ఉంది. ఏప్రిల్ 29న ఆచార్య రిలీజ్ వరకూ ఈ సినిమా కలెక్షన్స్ కు డోకా లేదనే చెప్పాలి. ట్రిపులార్ సాధించిన ఈ ఘనతపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.