దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్‌ఆర్‌ఆర్ చిత్రం శుక్రవారం(మార్చి25)న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ నేపథ్యంలో ఏ థియేటర్స్ వద్ద చూసినా సందడి వాతావరణం నెలకొంది. రిలీజ్ కి ముందే బాక్సాఫీస్ బద్దలవడం ఖాయంగా అనిపించిన ఈ చిత్రం… విడుదలయ్యాక తొలిరోజే బాక్సాఫీస్ షేక్ చేసింది. ఇప్పుడు సోషల్ మీడియాలోనూ ఆర్‌ఆర్‌ఆర్ మేనియానే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా గురించి పలు ఇంట్రెస్టింగ్ విశేషాలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఈ సినిమాలో ఎన్టీఆర్ వాడిన బైక్ గురించి చాలా రీసెర్చ్ చేశారట.
ఈ బైక్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. బ్రిటీష్ కాలం నాటి కధ కావడంతో అప్పటి కట్టడాలను కళాత్మకంగా తెరకెక్కించాడు దర్శక ధీరుడు రాజమౌళి. చరణ్ ఇందులో గుర్రపు స్వారీ చేస్తూ కనిపించగా, తారక్ మాత్రం బైక్ రైడ్ చేస్తూ అలరించాడు. ఎన్టీఆర్ వాడిన బైక్ గురించి ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పుకోవాలి.
బ్రిటీష్ కాలంలో వాడే బైక్ కోసం జక్కన్న తీవ్రంగా శ్రమించాడు. అప్పట్లో వెలా సెట్ బైక్ ట్రెండింగ్ లో ఉండేదట. ఆ తరహా బైక్ లు లభించకపోవడంతో ప్రత్యేకంగా తయారు చేయించాడట రాజమౌళి. ఈ బైక్ తయారీ కోసం 20 లక్షలు ఖర్చు చేశారట. మొత్తానికి ఈ బైక్ ఆర్.ఆర్.ఆర్ సినిమా స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది.
వెలిసెట్ బైక్ చరిత్ర:
1904 సంవత్సరంలో వెలా సెట్ బైక్ మోడల్స్ ఉండేవి. అప్పట్లో అంతర్జాతీయంగా ఫేమస్ పొందిన మోటార్ సైకిల్. కంపెనీ హెడ్ ఆఫీస్ బర్మింగ్‌హామ్‌లో ఉంది. 1920 నుంచి 1950 వరకు.. వెలోసెట్ అంతర్జాతీయ మోటార్ రేసింగ్ విభాగంలో ప్రధాన పోటీదారుగా నిలిచింది. శక్తివంతమైన 350 సిసి, 500 సిసి బైక్‌లను తయారు చేసింది ఈ వెలోసెట్.
అప్పట్లో పెద్ద పెద్ద మిషన్స్ లేవు.. చేతితో దాన్ని తయారు చేసేవాళ్ళు. 1920 నుంచి 1950 వరకు రేస్ బైక్ లు కూడా తయారు చేసేవాళ్ళు. దీనికి వరల్డ్ చాంపియన్ షిప్ టైటిళ్ళు కూడా వచ్చాయి. వెలోసెట్‌కు చెందిన 500 సీసీ బైక్ ను ఏకదాటిగా 24 గంటల పాటు గంటకు 161 కిలోమీటర్ల వేగంతో నడిపిన రికార్డు కూడా ఉంది.రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో ఈ బైక్స్ అత్యంత ప్రాచుర్యం పొందాయి. ఆటోమొబైల్ ఇండస్ట్రీలోకి ఎంత స్పీడ్‌గా వచ్చిందో అంతే స్పీడ్‌గా వెలోసెట్ కథ ముగిసిపోయింది.
ఆటోమొబైల్ కంపెనీల నుంచి తీవ్రమైన పోటీరావడంతో వెలోసెట్ బైక్‌ల ఉత్పత్తిని నిలిపివేసింది. ఫిబ్రవరి 1971లో కంపెనీ అధికారికంగా బైక్‌ల ఉత్పత్తిని నిలిపివేసింది. జాన్ గుడ్ మెన్, యుజెన్ గుడ్ మెన్, పెర్సీ గుడ్ మెన్, పీటర్ గుడ్ మెన్. వీరంతా ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తులు. ఆ బైక్ తయారీలకు వీరే యజమానులు. ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయిన ఆర్ఆర్ఆర్ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లతో దూసుకు పోతుంది.