ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడు దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన RRR సినిమా కోసమే ఎదురుచూస్తున్నారు సినీ అభిమానులు. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా రూపొందిన ఈ కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. ఈ పీరియాడిక్ మల్టీస్టారర్ ఎట్టకేలకు మార్చి 25న విడుదలకు సిద్ధమైంది. ప్రస్తుతం ఈ సినిమాపై అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయి.
ఈ క్రమంలో సినిమా విడుదలకు మూడు రోజుల ముందుగానే సినీ విమర్శకుడు, ఓవర్సీస్ సెన్సార్ బోర్డు సభ్యుడు ఉమైర్ సంధూ రివ్యూ ఇచ్చారు. RRR సినిమా బాక్సాఫీస్ ని షేక్ చేయడం ఖాయమని పేర్కొన్నారు. ‘అందరూ గర్వపడేలా ఈ సినిమా తీశారు. గొప్ప కలలు కనడమే కాదు.. వాటిని సాకారం చేసుకునే క్రమంలో ఒక భారతీయ దర్శకుడి సత్తాకు నిదర్శనమే RRR. ఈ సినిమాను అసలు మిస్ అవ్వకండి. ఈరోజు RRR బాక్సాఫీస్ బ్లాక్ బస్టర్ అనుకోవచ్చేమో.. కానీ ఇది ఓ క్లాసిక్ సినిమాగా చరిత్రలో నిలిచిపోతుంది. ఎన్టీఆర్, రామ్ చరణ్ చింపేశారు’ అని ఉమైర్ సంధూ ట్వీట్ లో తెలిపారు.
ఈ సినిమాకి కథ, స్క్రీన్‌ప్లేనే అసలు హీరో. మిమ్మల్ని 3 గంటల పాటు సీట్లో నుండి లేవకుండా కూర్చోబెడుతుంది. సినిమాలోని ప్రతి నటుడు అద్భుతమైన నటన కనబర్చారు. ముఖ్యంగా జూ. ఎన్టీఆర్, రామ్ చరణ్ లది డెడ్లి కాంబో.. అజయ్ దేవగణ్ సర్ ప్రైజ్ ప్యాకేజి, అలియా భట్ తన పాత్రకు న్యాయం చేసిందన్నారు. ఇక దర్శకుడు రాజమౌళి RRR మూవీతో ఇండియాలో నెంబర్ వన్ డైరెక్టర్ అనిపించుకుంటారని ఉమైర్ చెప్పుకొచ్చారు. అలాగే RRR సినిమాకు ఉమైర్ సంధు 5 స్టార్ రేటింగ్ ఇచ్చారు.
#RRRMoive Review from Censor Board. It makes you proud that an Indian filmmaker dared to dream big and accomplished it. It is definitely not to be missed. Call it a BO blockbuster today, but tomorrow,it ll be remembered as a classic.#JrNTR & #RamCharan Rocked it ! #RRR ⭐️⭐️⭐️⭐️⭐️
— Umair Sandhu (@UmairSandu) March 22, 2022
RRR మూవీకి కలరిస్ట్ గా పనిచేసిన శివకుమార్ బీవీఆర్ కూడా ట్విట్టర్ లో ఆయన రివ్యూ ఇచ్చారు. ‘ఇప్పుడే RRR చూశాను. కలరిస్ట్ గా ఒక్కో ఫ్రేమ్ వెయ్యిసార్లు చూశాను. సాధారణ ప్రేక్షకుడిగా లాస్ట్ కాపీ చూసినప్పుడు బాగా ఎమోషనల్ అయ్యా. ఈ సినిమా అన్ని రికార్డులను బ్రేక్ చేస్తుంది. భారతీయ చరిత్రలో కొత్త రికార్డులు సెట్ అవుతాయి. RRR 3వేల కోట్లకు పైగా వసూలు చేస్తుంది’ అని ట్వీట్ లో పేర్కొన్నారు. ప్రస్తుతం వీరి రివ్యూలు సినిమా పై మరింత హైప్ క్రియేట్ చేస్తున్నాయి. మరి RRR పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.
Just seen @RRRMovie. Although I saw each frame 1000s of times as a colorist, I was more emotional when I saw the last copy as a regular audience.
I say strongly, it breaks all records and creates new records that no one can break & it charges over 3k crores.
Write it down…. pic.twitter.com/z5LSrg1yRN
— Shiva Kumar BVR (@shivabvr) March 15, 2022