- మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.
RGV: ‘‘బాలీవుడ్ నన్ను భరించలేదు’’ అంటూ బాలీవుడ్ ఎంట్రీపై మహేష్ బాబు చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చకు దారితీసిన సంగతి తెలిసిందే. తన వ్యాఖ్యలు వివాదానికి దారి తీయటంతో మహేష్ దానిపై క్లారిటీ కూడా ఇచ్చారు. తాను ఆ మాటలు అన్న ఉద్ధేశం వేరని స్పష్టం చేశారు. అయినప్పటికి ఈ వివాదం ఇంతటితో ఆగేలా కనిపించటం లేదు. మహేష్ వ్యాఖ్యలపై నిత్యం ఎవరూ ఒకరు స్పందిస్తూనే ఉన్నారు. తాజాగా, దీనిపై ప్రముఖ దర్శకుడు ఆర్జీవీ కామెంట్స్ చేశారు. ఓ న్యూస్ ఛానల్ డిబేట్‌లో పాల్గొన్న ఆయన మహేష్ చేసిన వ్యాఖ్యల్ని తప్పుబట్టారు. ఆర్జీవీ మాట్లాడుతూ..‘‘ మహేష్ బాబు ఏ ఉద్ధేశ్యంతో ఆ మాటలన్నారో నాకు సరిగా తెలీదు.
కానీ, ‘‘బాలీవుడ్ నన్ను భరించలేదు’’ అనటం అర్థం లేని మాట. బాలీవుడ్ అనేది ఓ కంపెనీ కాదు.. అది హిందీ సినిమాలకు మీడియా తగిలించిన లేబుల్. ఒక కంపెనీ విషయంలో మహేష్ అసంతృప్తిగా ఉంటే ఆ కంపెనీ గురించి ఆయన మాట్లాడొచ్చు. కానీ, బాలీవుడ్ మొత్తానికి ఆపాదిస్తూ.. ‘‘బాలీవుడ్ నన్ను భరించలేదు’’ అనటం తప్పు. ఆయన అన్న దానికి అసలు అర్థమే లేదు. ప్రస్తుతం సౌత్ డబ్బింగ్ సినిమాలు హిందీలో మంచి విజయాన్ని సాధిస్తున్నాయి. బాలీవుడ్ వాళ్ల కంటే ఎక్కువ డబ్బులు సంపాదిస్తున్నాయి. బాలీవుడ్ ఆ స్థాయిని అందుకోలేకపోతోంది. ఈ ఉద్ధేశ్యంలోనే మహేష్ ఈ మాటలు అనుండొచ్చు. అలా కాకపోతే ఆయన అన్న మాటలకు అర్థమే లేదు’’ అని అన్నారు.
కాగా, కొద్దిరోజుల క్రితం మహేష్ బాబు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘‘ ‘‘ నాకు చాలా బాలీవుడ్ ఆఫర్లు వచ్చాయి. బాలీవుడ్ నన్ను భరించలేదు. వాళ్లతో సినిమా చేయటం నా టైం వేస్ట్. అందుకే హిందీ సినిమాల వైపు వెళ్లలేదు. నాకు తెలుగులో ఇంత ఆధరణ, ప్రేమ లభిస్తున్నపుడు వేరే ఇండస్ట్రీలోకి నేను ఎందుకు పోతాను. నేను ఎప్పటికీ ఇక్కడే సినిమాలు చేస్తాను.అవి పెద్ద ఎత్తున రిలీజ్ అవుతాయి. ఇప్పటిలాగే ఇకపై ఎప్పుడు ఇండియా మొత్తం తెలుగు సినిమాలను ఆస్వాధించాలి. తెలుగు సినిమాలే నా బలం.. నేను అర్థం చేసుకోగల ఎమోషన్ కేవలం తెలుగు సినిమా ఎమోషన్ మాత్రమే’’ అని అన్నారు. మరి, మహేష్ వ్యాఖ్యలపై వర్మ చేసిన కామెంట్స్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : సర్కారు వారి పాట మూవీకి పైరసీ భయం! మహేష్ ఫ్యాన్స్ ని అలెర్ట్ చేసిన…