నీ బుల్లెట్ బండెక్కి వచ్చేస్తా పా డుగ్గు డగ్గు..అంటూ సాగే పాట ఇటీవల సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఇదే పాటకు ఓ పెళ్లి కూతురు డ్యాన్స్ చేయటంతో ఈ పాట మరింత హిట్ అయింది. దీంతో ఈ పాటను ఎవరు రాశారు? రచయిత ఎవరన్న ప్రశ్నలు ఉత్పత్తన్నమవుతున్నాయి. ఇక ఈ పాట రైటర్ లక్ష్మణ్ తాజాగా సుమన్ టీవీ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.
ఇందులో పాటకు హిట్ కావటానికి కారణం, రెమ్యూనరేషన్ వంటి ఇంకా ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు చెప్పాడు రైటర్ లక్ష్మణ్. ఇక బుల్లెట్ బండి సాంగ్ హిట్ కావటానికి కారణం పెళ్లి కూతురు డ్యాన్స్ చేయటం వల్లే అని అందరూ అనుకుంటున్నారన్న ప్రశ్నకు..రైటర్ లక్ష్మణ్ పూర్తి సమాధానాలు ఇచ్చారు. నా బుల్లెట్ బండి సాంగ్ హిట్ కావటానికి కారణం పెళ్లి కూతురు కాదని, ఆ పాట బాగుండటంతోనే పెళ్లి కూతురు డ్యాన్స్ చేసిందని తెలిపాడు. ఆ పాటే లేకుంటే అసలు పెళ్లి కూతురు డ్యాన్స్ చేసుండేది కాదు కదా అంటూ సమాధానం ఇచ్చారు.
కాగా ఈ పాటకు నేను మంచి రెమున్యూరేషన్ తీసుకున్నానని, కానీ ఇంత పెద్ద హిట్ అవుతుందని అనుకోలేదని అన్నారు. ఇక సినిమాల్లో పాటలను రాయటానికి నాకు ఫోన్స్ చేస్తున్నారని తెలిపారు. నేను గతంలో ఓ మంచి స్టార్ హీరో సినిమాలో పాట రాశానని, ఆ సాంగ్ పెద్ద హిట్ కాలేదని అన్నారు. భవిష్యత్‌లో మరిన్ని పాటలతో మంచి హిట్‌లు కొడతానని తెలిపారు. ఇక దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో మాకు తెలియజేయండి.