కొన్నిసార్లు బాక్సాఫీస్ దగ్గర మ్యాజిక్స్ జరుగుతుంటాయి. ఓ సినిమాకు అనుకున్నంతగా పాజిటివ్ టాక్ రాకపోయినా సరే కలెక్షన్స్ మాత్రం వచ్చిపడుతుంటాయి. దానికి కారణాలు ఏంటనేది ఎవరూ చెప్పలేం. ప్రస్తుతం జరుగుతున్నది అదే. తాజాగా ‘ధమాకా’ మూవీతో వచ్చిన రవితేజ.. ప్రేక్షకుల్ని ఎంటర్ టైన్ చేస్తున్నాడు. ఊహించని రీతిలో వసూళ్లు సాధిస్తున్నాడు. ఇండస్ట్రీలో ఇప్పుడు ఇది హాట్ టాపిక్ గా మారింది. ఇక కలెక్షన్స్ నంబర్ అయితే విమర్శకులను సైతం ఆశ్చర్యపోయేలా చేస్తోంది.
ఇక విషయానికొస్తే.. ఈ ఏడాది రవితేజకు అస్సలు కలిసిరాలేదు. ఖిలాడి, రామారావు ఆన్ డ్యూటీ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టేశాయి. ఘోరంగా ఫెయిలయ్యాయి. ఈ క్రమంలోనే ‘ధమాకా’ అనే కామెడీ ఎంటర్ టైనర్ తో తాజాగా థియేటర్లలోకి వచ్చాడు. ఈ సినిమాకు తొలిరోజు మిక్స్ డ్ టాక్ వచ్చినప్పటికీ కలెక్షన్స్ మాత్రం బాగానే వచ్చాయి. తొలిరోజు ప్రపంచవ్యాప్తంగా రూ.10 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు స్వయంగా నిర్మాణ సంస్థ వెల్లడించింది. ఇకపోతే ఈ సినిమాకు ఇప్పుడు వీకెండ్ కూడా బాగా కలిసొచ్చినట్లు కనిపిస్తోంది.
‘ధమాకా’.. ఫుల్ కామెడీ ఎంటర్ టైనర్ కావడం, ఇందులో శ్రీలీల డ్యాన్సులతో ఇరగ్గొట్టేసింది అనే టాక్ రావడం ఈ సినిమాకు చాలా ప్లస్ అయ్యాయి. తెలిసిన స్టోరీనే అని సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నప్పటికీ.. ‘ధమాకా’కు ఆడియెన్స్ క్యూ కడుతున్నారు. అలా మూడు రోజుల్లో వరల్డ్ వైడ్ రూ.32 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు ప్రకటించారు. తెలుగు రాష్ట్రాల నుంచే రూ.25 కోట్లపైన గ్రాస్ సాధించినట్లు తెలుస్తోంది. సంక్రాంతి వరకు పెద్ద సినిమాలేం కాబట్టి బాక్సాఫీస్ దగ్గర ‘ధమాకా’ మేనియా కంటిన్యూ కావొచ్చు. చూడాలి మరి లాంగ్ రన్ ‘ధమాకా’.. ఎన్ని కోట్లు వసూలు చేస్తుందో?
MassMaharaja @RaviTeja_offl ‘s
MASSive 3️⃣ Days
MASS Rampage 💥#DhamakaBlockBuster in Cinemas Now 🥳🤩#DhamakaBook your tickets nowhttps://t.co/iZ40p9utmY@sreeleela14 @TrinadharaoNak1 @vishwaprasadtg @vivekkuchibotla @KumarBezwada pic.twitter.com/6sD6Ev5F7O
— People Media Factory (@peoplemediafcy) December 26, 2022