ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా.. కేవలం స్వశక్తి, ప్రతిభను నమ్ముకుని.. ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు మాస్ మహారాజా రవితేజ. ఎన్నో కష్టనష్టాలకు ఓర్చుకుని.. ఎట్టకేలకు ఇండస్ట్రీలో హీరోగా నిలదొక్కుకుని.. ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి తర్వాత ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా స్టార్ హీరోగా ఎదిగాడు రవితేజ. ప్రసుత్తం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇప్పటికే రవితేజ చేతిలో 5 సినిమాలు ఉన్నట్లు సమాచారం. వీటిలో రామారావు ఆన్ డ్యూటీ చిత్రాన్ని 2022, జూన్ 17న ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తుండగా.. దసరాకు ధమాకాతో రానున్నట్లు తెలుస్తోంది. హీరోగా ఇంత బిజీగా ఉన్న రవితేజ సినిమాలకు సంబంధించి ఓ సంచలన నిర్ణయం తీసుకుని అభిమానులను షాక్‌కు గురి చేశారు. ఆ నిర్ణయం ఏంటంటే..
ఇది కూడా చదవండి: ఎవరీ టైగర్ నాగేశ్వరరావు? రెండు బయోపిక్ లు తీస్తున్నారంటే..
ఇకపై కేవలం హీరోగానే కాకుండా పాత్ర నచ్చితే సపోర్టింగ్ క్యారెక్టర్స్ కూడా చేయాలని రవితేజ నిర్ణయించుకున్నట్లు ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతోంది. కథ నచ్చితే ఇతర హీరోల సినిమాల్లో కూడా నటించడానికి తనకేమీ అభ్యంతరం లేదని ఇప్పటికే దర్శకులకు ఓ మాట చెప్పినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే యంగ్ హీరోల్లో కొందరు, శ్రీకాంత్, జగపతి బాబు లాంటి సీనియర్ హీరోలు ఈ తరహా పాత్రలు చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా రవితేజ వారి జాబితాలో చేరనున్నట్లు ఫిల్మ్ నగర్‌లో వార్తలు వినిపిస్తున్నాయి.
ఇది కూడా చదవండి: అన్ స్టాపబుల్ షోలో రవితేజ ఎమోషనల్! డ్రగ్స్ కేసు గురించి…
ఈ క్రమంలోనే చిరంజీవి హీరోగా బాబీ డైరెక్షన్‌లో రాబోయే సినిమాలో రవితేజ ఓ కీలకమైన పాత్రలో కనిపించనున్నాడని సమాచారం. మరోవైపు బాలకృష్ణ, అనిల్ రావిపూడి సినిమాలో కూడా రవితేజ నటించనున్నట్లు ప్రచారం జరుగుతుంది. అయితే దీనిపై అధికారిక సమాచారం రావాల్సి ఉంది. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: బాలయ్యతో సందడి చేసిన మాస్ మహారాజా రవితేజ!
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.