మాస్ మహారాజా రవితేజ ఎనర్జీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెరపై ఆయన చూపించే జోష్ అభిమానులకు పూనకాలు తెప్పిస్తుంది. కొన్ని ఏళ్లుగా ఫ్లాప్‌లతో సతమతమైన రవితేజ క్రాక్ సినిమాతో తన స్టామినా ఏంటో మరోసారి బాక్సాఫీస్‌కు రుచిచూపించారు. ఒక ఈ సినిమా ఇచ్చిన కిక్కుతో రవితేజ్ ఫుల్ స్పీడు పెంచారు. ఏకంగా 5 సినిమాలను లైన్లో పెట్టి ఫ్యాన్స్ ఫుల్ జోష్ ఇచ్చారు. ఈ సినిమాల్లో ఒక పాన్ ఇండియా సినిమా కూడా ఉండడం విశేషం. రవితేజ ఎనర్జీకి ఏ పాత్రతోనైనా సినీ ప్రేక్షకులను కట్టిపడేయగలరు. అందుకే ఇప్పటి వరకు తెలుగు వారికే పరిమితమైన ఆయన నట విశ్వరూపం ‘టైగర్ నాగేశ్వరరావు’ సినిమాతో దేశవ్యాప్తంగా పరిచయం కానుంది.
ఈ సినిమాతో పాటు ఇప్పటికే ఖిలాడి మూవీ విడుదలకు సిద్ధమైంది. దీంతోపాటు థమాకా, రామారావు, రావణాసుర అనే సినిమాలతో 2022 ఏడాది మొత్తం రవితేజ సినిమాలతో థియేటర్లు నిండిపోనుంది. సీనియర్ హీరో అయిన రవితేజ జోరు చూసి యువ కథనాయకులే ఆశ్చరపోతున్నారు. నిజానికి మన తెలుగు ఇండస్ట్రీలో ఈ మధ్య కాలంలో ఏ స్టార్ హీరో కూడా ఇన్ని సినిమాలను ప్రకటించలేదు. ఏడాదికి ఒక సినిమాను ప్లాన్ చేసుకుంటూ వెళ్తుంటారు. కాగా కరోనాతో కాస్త బ్రేక్ దొరకడం ఆ సమయంలో చేయాల్సిన సినిమాలను ఇప్పుడు ప్రకటిస్తున్నారు. అవి కూడా మహా అయితే రెండు, మూడు. కానీ రవితేజ మాత్రం ఏకంగా 5 సినిమాలతో మస్తు బీజీగా ఉన్నారు. ఇక రవితేజ ఫ్యాన్స్‌కు 2022 ఏడాది మొత్తం పండగే పండగ.
Upcoming blockbusters of our #MassMaharaj @RaviTeja_offl 🔥💥
We got our upcoming 5 titles and tags🤙#Khiladi #RamaRaoOnDuty#Dhamaka #Ravanasura #TigerNageswaraRao🐅 pic.twitter.com/Ro1HL15oSD— Tanweer😎 (@Tanweer554_RTF) November 5, 2021