తమిళ స్టార్ హీరో దళపతి విజయ్, రష్మిక మందన్నా జంటగా నటించిన ‘వారిసు’ సినిమా జనవరి 11న ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా మంచి కలెక్షన్లతో దూసుకుపోతోంది. తెలుగులో వారసుడుగా డబ్ అయింది. తెలుగులోనూ పర్లేదు అనిపించుకుంది. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 200 కోట్ల రూపాయల కలెక్షన్లను కొల్లగొట్టినట్లు తెలుస్తోంది. ఇక, ఈ సినిమాలో పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా పాటలకు దళపతి విజయ్ డ్యాన్స్ అదిరిపోయింది. విజయ్ ఫ్యాన్స్ వారిసు సినిమాలోని రంజితమే.. జిమిక్కు పొన్ను పాటలకు డ్యాన్స్ చేసి మురిసిపోతున్నారు. ఆ డ్యాన్స్ తాలూకా వీడియోలను తమ సోషల్ మీడియా ఖాతాల్లో షేర్ చేసి హల్ చల్ చేస్తున్నారు. తాజాగా, ఓ పిల్లాడు జిమిక్కు పొన్ను పాటకు డ్యాన్స్ చేశాడు.
ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. విజయ్ ఫ్యాన్స్ ట్రెండ్ ట్విటర్ ఖాతాలో ఉన్న ఈ వీడియోపై వారిసు హీరోయిన్ రష్మిక మందన్నా స్పందించారు. కుర్రాడి డ్యాన్స్‌కు ఫుల్ ఖుషీ అయిపోయారు. ఆ డ్యాన్స్ వీడియోను తన ట్విటర్ ఖాతాలో షేరే్ చేశారు. ‘ఓరి దేవుడా! అద్భుతంగా ఉంది’’ అని రాసుకొచ్చారు. ఆ వీడియోలో ఓ ఐదు-ఆరు ఏళ్ల పిల్లాడు జిమిక్కు పొన్ను పాటకు అచ్చం విజయ్ లాగే స్టెప్పులు వేశాడు. ఎక్స్‌ప్రెషన్స్‌లో కూడా విజయ్ను అనుకరించాడు. ఎంతో ఈజ్‌తో పాటకు డ్యాన్స్ చేశాడు. ఈ వీడియోపై కొంతమంది నెటిజన్లు స్పందిస్తూ.. ‘‘ ఒరిజినల్ కంటే ఈ డ్యాన్స్ బాగా ఉంది’’.. ‘‘ డ్యాన్స్ అదరగొట్టావు బుడ్డోడా’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరి, ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Oh My God! Like woah !! 👌🏻👌🏻 https://t.co/2AZR123Vyy
— Rashmika Mandanna (@iamRashmika) January 17, 2023