రష్మిక మందన్న టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా వరుస సినిమాతో దూసుకెళ్తోంది. తాజాగా రష్మికకు సంబంధించిన ఓ హాట్ అండ్ బోల్డ్ వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
సోషల్ మీడియా వాడకం పెరిగాక.. సెలబ్రిటీలకు, అభిమానులకు మధ్య దూరం తగ్గిందనే చెప్పాలి. సెలబ్రిటీలు తమకు సంబంధించిన విషయాలను, ఫోటోలను, వీడియోలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. ఇక తమ అభిమాన తారల ఫోటోలు, వీడియోలు చూసి తెగ మురిసిపోతుంటారు ఫ్యాన్స్. ఈ క్రమంలోనే తన అభిమానులకు అదిరిపోయే అందాల ట్రీట్ ఇచ్చింది నేషనల్ క్రష్ రష్మిక మందన్న. తాజాగా ఓ బోల్డ్ ఫోటో షూట్ లో పాల్గొన్న రష్మిక అందుకు సంబంధించిన వీడియోను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.
రష్మిక మందన్న.. టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా వరుస సినిమాతో దూసుకెళ్తోంది. తాజాగా దళపతి విజయ్ హీరోగా తెరకెక్కిన వారసుడు సినిమాతో మంచి విజయాన్ని దక్కించుకుంది రష్మిక. అయితే ఈ మధ్య కాలంలో యంగ్ హీరో విజయ్ దేవరకొండతో డేటింగ్ చేస్తోంది అంటూ తరచుగా వార్తల్లో నిలిచింది ఈ ముద్దుగుమ్మ. ఓ వైపు తెలుగులో సినిమాలు చేస్తూనే.. మరోవైపు బాలీవుడ్ లో వరుస సినిమాలతో బిజీగా ఉంది ఈ శ్రీవల్లి. అయితే తాజాగా రష్మిక మందన్నకు సంబంధించిన ఓ హాట్ అండ్ బోల్డ్ వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఈ వీడియోలో తన థైస్ అందాలతో పాటు కైపెక్కించే చూపులతో కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తోంది. రష్మికను ఇప్పటి వరకు ఇలాంటి వీడియోలో ఎప్పుడూ చూసుండరు, అంతలా ఆమె అందాలను ఆరబోసింది.
అయితే ఇది ఓ యాడ్ షూట్ లో భాగంగా తీసిన వీడియోగా తెలుస్తోంది. ఎంత యాడ్ షూట్ అయినప్పటికీ ఇంత అందమా అంటున్నారు ఈ వీడియో చూసిన అభిమానులు. ఇక ఎప్పటిలాగే షూటింగ్ స్పాట్ లో తన చిలిపితనంతో కవ్వించింది రష్మిక. నేను చేసే పనిని ఎప్పుడూ ప్రేమిస్తూ.. ఆస్వాదిస్తాను అని క్యాప్షన్ సైతం ఇచ్చింది. ప్రస్తుతం రష్మిక పుష్ప2తో పాటుగా బాలీవుడ్ లో రణ్ బీర్ కపూర్ కు జోడీగా యానిమల్ సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాకు టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహిస్తున్నాడు. మరి తాజాగా వైరల్ అవుతున్న రష్మిక బోల్డ్ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.