పాన్ ఇండియా మూవీ ‘పుష్ప’తో నేషనల్ వైడ్ ఫాలోయింగ్ పెంచుకుంది అందాల భామ రష్మిక మందన్నా. ఇప్పుడు ఇటు సౌత్ లో, అటు నార్త్ లో దూసుకపోతుంది. భారీ సినిమాలను దక్కించుకుంటూ తన సత్తాని చాటుకుంటుంది. కోలివుడ్ స్టార్ హీరో విజయతో ఈ బ్యూటీ జోడి కట్టబోతుందని గత కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా ఈ న్యూస్ ను నిజం చేసింది చిత్ర యునిట్. రష్మిక బర్త్ డే(ఏప్రిల్ 5) సందర్భంగా ఈ విషయాన్ని ప్రకటించారు.
‘పుష్ప’ సినిమాలో శ్రీవల్లి గా నటించి అందరిని ఆకట్టుకుంది రష్మిక. ఈ సినిమాతో ఈ బ్యూటీ స్టార్ డమ్ అమాంతం పెరిగింది. బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో టాలీవుడ్, కోలివుడ్,శాండిల్ వుడ్ , బాలీవుడ్.. ఇలా అన్ని పరిశ్రమలో బిజీగా దూసుకపోతుంది. ఈ క్రమంలోనే ఇళయ దళపతి విజయ్ తో ఈ భామ నటించనున్నట్లు టాక్ వినిపించింది. తాజాగా తెలుగు డైరెక్టర్ వంశీపైడిపల్లి రూపొందిస్తున్న తెలుగు, తమిళం బై లింగ్వల్ మూవీ `విజయ66` లో రష్మిక మందన్నాని హీరోయిన్గా ఖరారు చేశారు. ఆమెని ప్రాజెక్ట్ లోకి ఆహ్వానిస్తూ బర్త్ డే విషెస్ తెలిపారు.
YES! #Thalapathy66 @actorvijay❤️ pic.twitter.com/sU89vEEJ1V
— Rashmika Mandanna (@iamRashmikah) April 5, 2022
ఈ సినిమాతో విజయ్ తెలుగులోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఈ విషయాన్ని రష్మిక సోషల్ మీడియా లో షేర్ చేసింది. మరోవైపు కొత్తగా హిందీలో రణ్‌బీర్ కపూర్‌తో `యానిమల్` సినిమా చేస్తుంది. ఇటీవలే చిత్ర దర్శకుడు సందీప్‌రెడ్డి వంగా ఈ చిత్రాన్ని ప్రకటించారు. మరోవైపు`మిషన్ మజ్ను`, `గుడ్‌బై` సినిమాలు చేస్తుంది రష్మిక. అలాగే తెలుగులో `పుష్ప-2`లోనూ ఆమె హీరోయిన్గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఇలా తెలుగు, తమిళం, హిందీలో బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు చేస్తూ దూసుకుపోతుందీ నేషనల్ క్రష్. మరి.. విజయ, రష్మిక మందన్నా జోడిగా రాబోతున్న ఈ కొత్త చిత్రంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.