ప్రస్తుతం పాన్ ఇండియా హీరోయిన్లలో టాప్ ఎవరంటే చాలామంది రష్మిక పేరు చెబుతారు. ఎందుకంటే ‘పుష్ప’ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత ఆమె వరసగా తెలుగు, తమిళ, హిందీ మూవీస్ చేస్తూ బిజీగా ఉంది. ఆరేళ్ల కెరీర్ లో ఇప్పటివరకు 17కి పైగానే సినిమాలు చేసింది. ఇందులో గ్లామర్ రోల్స్ తోపాటు క్యారెక్టర్ ఓరియెంటెడ్ పాత్రలు కూడా ఉన్నాయి. అలానే ఈ మధ్య కాలంలో రష్మికపై విపరీతమైన ట్రోలింగ్ జరుగుతుంది. చేస్తుంది కూడా కన్నడ నెటిజన్సే. ఇలాంటి టైంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రష్మిక.. తన గురించి చాలా విషయాల్ని బయటపెట్టింది. కానీ రష్మిక.. వెక్కి వెక్కి ఏడ్చానని చెప్పినది కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. ‘కిరిక్ పార్టీ’ మూవీతో హీరోయిన్ గా మారిన రష్మిక, తెలుగులో ‘ఛలో’ మూవీతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత కాలంలో సూపర్ స్టార్ మహేశ్ బాబు, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో సినిమాలు చేసింది. టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుని.. ఏకంగా పాన్ ఇండియా స్థాయిలోనూ క్రేజ్ సంపాదించింది. అయితే కొన్ని రోజుల ముందు ‘కాంతార’ రిలీజ్ టైంలో ఓ ఇష్యూ జరిగింది. అప్పటి నుంచి రష్మికని కన్నడ నెటిజన్స్ ట్రోల్ చేస్తూనే ఉన్నారు. ఆ తర్వాత కూడా మాటా మాటా పెరిగి పరోక్షంగా కామెంట్స్ చేసుకుంటూనే ఉన్నారు. ఇలాంటి టైంలో తెలుగులో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రష్మిక.. ఇన్ని విమర్శలు వస్తున్నా సరే తాను ఎలా ప్రశాంతంగా ఉండగలుగుతున్నానో రివీల్ చేసింది.
‘ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా సరే నవ్వుతూనే ఉంటావ్.. ఎలా సాధ్యం? అని చాలామంది అడుగుతుంటారు. నేను చిన్నప్పుడు ఇలా బతకడం నేర్చుకున్నాను. స్కూల్ లో చదువుకునేటప్పుడు కుటుంబానికి దూరంగా హాస్టల్ లో ఉండేదాన్ని. దాదాపు 800 మంది స్టూడెంట్స్ అక్కడ ఉండేవాళ్లు. ఎవరూ నాతో సరిగా ఉండేవాళ్లు కాదు. కమ్యూనికేషన్ స్కిల్స్ తక్కువగా ఉండటంతో చాలా అపార్థం చేసుకునేవారు. చేయని తప్పులకు కూడా మాట పడేదాన్ని. ఆ టైంలో ప్రతిరోజూ రాత్రి గదిలో కూర్చొని వెక్కివెక్కి ఏడ్చేదాన్ని. అయితే ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా సరే అమ్మతో షేర్ చేసుకోవడం నాకు అలవాటు. ఆమెనే నన్ను ఇంత స్ట్రాంగ్ గా చేసింది. ప్రపంచంలో ఎన్నో పెద్ద సమస్యలు ఉన్నాయని కాబట్టి దీని గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదని చెప్పింది. అందుకే మనసులో ఎంత బాధ ఉన్నా బయటకు నవ్వుతూనే ఉంటాను’ అని రష్మిక చెప్పుకొచ్చింది. మరి రష్మిక వ్యాఖ్యలపై మీరేం అనుకుంటున్నారు. కింద కామెంట్స్ లో మీ అభిప్రాయాన్ని పోస్ట్ చేయండి.