తెలుగులో జాతిరత్నాలు సినిమా హిట్ తో స్పీడ్ లో ఉన్నాడు దర్శకుడు అనుదీప్. ఈ చిత్రం అనుకున్నదాని కంటే ఎక్కువ విజయం సాధించి వసూళ్ల పరంగా కూడా ఎక్కడ తగ్గలేదనే చెప్పాలి. ఈ సినిమా విజయంతో ఆయనతో చిత్రాలు చేసేందుకు నిర్మాతలు క్యూ కట్టారంట. ఇక తాజాగా ఓ తమిళ హీరోతో సినిమా చేయటానికి ముందుకొచ్చాడు ఈ యంగ్ డైరెక్టర్. తమిళ హీరో శివ కార్తికేయన్ తో అనుదీప్ ఓ సినిమా చేసేందుకు సిద్దమైనట్లు ఇటీవల ఓ ప్రకటన కూడా చేశారు. ఈ మూవీని శ్రీ వెంకటేశ్వర సినిమాస్ నిర్మించనుందని తెలుస్తోంది.
తెలుగుతో పాటు తమిళంలో కూడా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారట. ఇక విషయానికొస్తే ఇందులో హీరోయిన్ గా ఎవరిని సెలక్ట్ చేయాలో అని డైరెక్టర్ అనుదీప్ తికమకలో ఉన్నాడట. ఇక తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రంలో హీరోయిన్ గా టాలీవుడ్ లో దూకుడు మీదున్న రష్మిక మందనాను సెలెక్ట్ చేసినట్లు ఫిల్మ్ నగర్ లో వార్తలు జోరందుకున్నాయి. తెలుగు, తమిళం, మలయాళం వంటి భాషల్లో నటిస్తూ టాప్ హీరోయిన్ గా కొనసాగుతోంది ఈ భామ.
టాలీవుడ్ లో అగ్ర హీరోల సరసన నటిస్తూ తన నటనతో ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం చేస్తోంది ఈ అందాల సుందరి. ఇక తన అందం, అభినయంతో కుర్రకారును మతిపోగొడుతోంది ఈ సుందరి. ఇక ఎలాగైనా ఈ సినిమాలో రష్మికనే హీరోయిన్ గా ఎంచుకోవాలని దర్శకుడు అనుదీప్ భావిస్తున్నట్లు సమాచారం. మరి నిజంగానే ఇందులో హీరోయిన్ గా రష్మిక తీసుకుంటారా లేదా అనేది అధికారక ప్రకటన వచ్చేంత వరకు వెయిట్ చేయాల్సిందే.