గత కొంత కాలంగా సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్న విషయం తెలిసిందే. స్టార్ నటులు, దర్శక, నిర్మాతలు కన్నుమూయడంతో వారి కుటుంబంలోనే కాదు.. అభిమానులు సైతం శోకసంద్రంలో మునిగిపోతున్నారు.
ఇటీవల సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్న విషయం తెలిసిందే. ప్రముఖ నటీనటులు, దర్శక, నిర్మాతలు ఇతర రంగాలకు చెందిన వారు కన్నుమూయడంతో వారి కుటుంబ సభ్యులే కాదు అభిమానులు సైతం శోకసంద్రంలో మునిగిపోతున్నారు. గత ఏడాది నుంచి తెలుగు ఇండస్ట్రీలో దిగ్గజ నటులు కన్నుమూశారు. తాజాగా ప్రముఖ సీనియర్ నటి కన్నుమూయడంతో ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. వివరాల్లోకి వెళితే..
హాలీవుడ్ లో ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో నటించిన ప్రముఖ నటి రాక్వెల్ వెల్చ్ కన్నుమూశారు. ఆమె వయసు 82 సంవత్సరాలు. రాక్వెల్ వెల్చ్ మేనేజర్ విడుదల చేసిన అధికార ప్రకటన ప్రకారం.. గత కొంత కాలంగా రాక్వెల్ వెల్చ్ అనారోగ్యంతో బాధపడుతూ బుధవారం కన్నమూశారని తెలిపారు. 1940లో జన్మించిన ఆమె కాలిఫోర్నియలో పెరిగారు. టీనేజ్ లో మోడలింగ్ గా ఎన్నో టైటిల్స్ గెల్చుకున్నారు. రాక్వెల్ వెల్చ్ఆ ర్ట్ స్కాలర్‌షిప్‌పై శాన్ డియాగో స్టేట్ కాలేజీలో చేరిన తర్వాత ఆమె థియేటర్ యాక్టర్‌గా తన కెరీర్‌ను ప్రారంభించింది.
1966లో విడుదలైన వన్ మిలియన్ ఇయర్స్ బిసీ చిత్రంలో కేవ్వుమన్గా పాత్ర ఆమెకు ఎంతో మంచి పేరు తెచ్చిపెట్టింది. 1968 చలనచిత్రం లేడీ ఇన్ సిమెంట్‌లో ఫ్రాంక్ సినాత్రా పాత్ర యొక్క ప్రేమ పాత్రలో ఆమె అత్యంత ఆదరణ లభించింది. 1974లో విడుదలైన ది త్రీ మస్కటీర్స్ చిత్రంలో తన నటనకు గోల్డెన్ గ్లోబ్ అవార్డును గెలుచుకుంది. 50 ఏళ్ల కెరీర్ లో 30 సినిమాలు, 50 టెలివిజన్ ధారావాహికలతో పాటు ఎన్నో ప్రదర్శనలు ఇచ్చారు. రాక్వెల్ వెల్చ్ కి ఇద్దరు సంతానం. కొడుకు డామన్ వెల్చ్ కూతురు తహ్ని వెల్చ్. వీరిద్దరూ కొంత కాలంగా ఆమెకు దూరంగా ఉంటున్నారు. ఆమె మృతికి ఇండస్ట్రీ ప్రముఖులు నివాళులర్పించారు.
So sad to hear about Raquel Welch’s passing. I loved working with her on Legally Blonde. She was elegant , professional and glamorous beyond belief. Simply stunning. May all her angels carry her home. 🕊️ Sending love to her family and her many fans ❤️ pic.twitter.com/FBtXhpvS25
— Reese Witherspoon (@ReeseW) February 15, 2023