సాధారణంగా హీరోయిన్లు గొడవలు లాంటి వాటికి వీలైనంత దూరంగా ఉంటారు. ఈమె మాత్రం ఏకంగా ఐపీఎస్ రేంజ్ పోలీస్ తోనే గొడవపెట్టుకుంది. ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయిపోయింది. మరి ఈమెని గుర్తుపట్టారా?
హీరోయిన్లని పబ్లిక్ ఫిగర్స్. అంటే వాళ్లని ప్రతిఒక్కరూ గమనిస్తూ ఉంటారు. ఏదైనా గొడవలో వీళ్ల పేరుంటే చాలు సోషల్ మీడియా మొత్తం వీళ్ల గురించి మాట్లాడుతారు. అలా తాజాగా ఈ హీరోయిన్ తెగ వైరల్ అయింది. దానికి కారణం ఏంటంటే.. ఏకంగా ఓ పోలీస్ తోనే గొడవపెట్టుంది. వారం పదిరోజుల నుంచి ఈ వ్యవహారం నడుస్తున్నప్పటికీ.. రీసెంట్ గా బయటకొచ్చింది. దీంతో అందరూ ఈ బ్యూటీ గురించే మాట్లాడుకుంటున్నారు. సినిమా హీరోయిన్ గా కంటే ఈ ఇష్యూ వల్లే బాగా ఫేమస్ అయిందని అంటున్నారు. మరి ఆమె ఎవరో గుర్తుపట్టారా? కింద కామెంట్ చేయండి.
ఇక వివరాల్లోకి వెళ్తే.. పైన ఫొటోలో కనిపిస్తున్న చిన్నారి తెలుగమ్మాయి. విజయవాడలో పుట్టి పెరిగింది. తల్లి తెలుగు, తండ్రి తమిళ వ్యక్తి. టీనేజ్ లో ‘గల్ఫ్’ సినిమాలో హీరోయిన్ గా నటించే ఛాన్స్ కొట్టేసింది. అవును మీరు గెస్ చేసింది కరెక్ట్. ఈ హీరోయిన్ పేరు డింపుల్ హయాతి. ‘గల్ఫ్’ సినిమా తర్వాత ‘అభినేత్రి 2’లో సైడ్ క్యారెక్టర్ చేసింది. మెగాహీరో వరుణ్ తేజ్ ‘గద్దలకొండ గణేష్’లో సూపర్ హిట్ అనే ఐటమ్ సాంగ్ లో ఒంపుసొంపులు చూపించి అదరగొట్టేసింది. ‘యురేకా’ సినిమాలోనూ హీరోయిన్ గా చేసింది.
రీసెంట్ టైంలో రవితేజ ‘ఖిలాడి’, గోపీచంద్ ‘రామబాణం’ సినిమాల్లో హీరోయిన్ గా చేసింది. కానీ ఈ రెండూ కూడా బాక్సాఫీస్ దగ్గర బోల్తాకొట్టాయి. అంతకు ముందు తమిళంలో ఒకటి, హిందీలో మరో మూవీ చేసింది. ఇన్ని సినిమాలు చేసినా హిట్స్ అనేవి లేకపోవడంతో గుర్తింపు తెచ్చుకోలేకపోయింది. తాజాగా తన అపార్ట్ మెంట్ లో ఉంటున్న ఓ ఐపీఎస్ అధికారితో గొడవపడింది. ఇప్పుడు ఆ విషయం కాస్త ఇండస్ట్రీలో పెద్ద చర్చకు కారణమైంది. అసలుకే హీరోయిన్ గా అంతంత మాత్రంగా ఈమె కెరీర్ వెళ్తోంది. సరిగా ఇలాంటి టైంలో ఈ గొడవ మైనస్ అయ్యే ఛాన్సులే ఎక్కువగా కనిపిస్తున్నాయి. సరే ఇదంతా పక్కనబెడితే ఈ హీరోయిన్ చిన్నప్పటి పిక్ చూసి మీలో ఎంతమంది గుర్తుపట్టారు? కింద కామెంట్ చేయండి.