పూరి జగన్నాధ్ తనయుడు ఆకాష్ పూరి హీరోగా కేతిక శర్మ హీరోయిన్ గా తెరకెక్కిన మూవీ రొమాంటిక్. అనీల్ పాదూరి దర్శకత్వంలో పూరీ కనెక్ట్ పతాకంపై పూరీ జగన్నాధ్, చార్మీ నిర్మించిన ఈ చిత్రం ఇటీవలే విడుదలై సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతోంది. అయితే ఈ సినిమాను చూసిన ప్రముఖ దర్శకులు సినిమా యూనిట్ పై ప్రశంసల వర్షం కురిపించారు. అయితే తాజాగా ప్రముఖ సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సైతం స్పందించారు.
ట్విట్టర్ లో ఈ చిత్ర హీరో, హీరోయిన్ నటనపై కితాబిచ్చారు. ఆకాష్ పూరీ, కేతిక శర్మ తమ కెమిస్ట్రీతో బాక్సాఫీస్ ను బర్న్ చేశారని అన్నాడు. ఇక ఇలాంటి సినిమాను రూపొందించిన దర్శకుడు అనీల్ పాదూరి, నిర్మాతలు పూరి, ఛార్మిలకు వర్మ సెల్యూట్ చెప్పారు. కాగా వర్మ చేసిన ట్వీట్ కు రీ ట్వీట్ ఇచ్చింది ఈ సినిమా హీరోయిన్ కేతిక శర్మ. వర్మకు థాంక్స్ చెప్పింది. దానికి వర్మ రిప్లై ఇస్తూ హే కేతిక మాకు హాట్ అండ్ రొమాంటిక్ ఫీల్ తెప్పించిన నీకు నేను, ఆడియన్స్ థాంక్స్ చెప్పాలంటూ బదులిచ్చాడు.
ROMGRAATS 💐💐💐to ROMANTIC THUNDER STAR @ActorAkashPuri and the RRROMANTIC HOT BEAUTY STAR @ketikasharmaa for BURNING the BOX OFFICE with their REMISTRY and a salute to the PROMANTIC PASSION of the producers team of #PuriJagannadh @Charmmeofficial and director #AnilPaduri 💐🍾💃🏿
— Ram Gopal Varma (@RGVzoomin) October 29, 2021