మెగాస్టార్ చిరంజీవి, స్టార్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్లో ‘ఆచార్య’ చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో మరో ముఖ్యపాత్రలో మెగా పవర్ స్టార్ రాంచరణ్ (సిద్ద) పాత్రలో కనిపించబోతున్నారు. సురేఖ కొణిదెల సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్ టైన్ మెంట్స్ పతకాలపై ఈ చిత్రం నిర్మితమవుతోంది. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. కాజల్ అగర్వాల్, పూజ హెగ్డేలు ఈ సినిమాలో హీరోయిన్లుగా మెరవబోతున్నారు.
ఇది చదవండి: నీ ఫ్యాన్స్ కి కూడా భయపడను.. సుధీర్ పై కమెడియన్ ఫైర్!
ఈ చిత్రంలో ఎప్పుడో రిలీజ్ కావాల్సి ఉన్నా కరోనా ప్రభావంతో షూటింగ్ క్యాన్సిల్ అయ్యింది. ఈ మద్య మళ్లీ షూటింగ్ షరవేగంగా సాగుతుంది. అయితే ఆచార్య షూటింగ్ లోకేషన్ లో పలువురు సెలబ్రెటీలు సందడి చేస్తున్నారు. తాజాగా ‘ఆచార్య’ సెట్‌లో ఓ అరుదైన దృశ్యం చోటు చేసుకుంది. అటు చిరంజీవి… ఇటు తనయుడు చరణ్… మధ్యలో సురేఖ పిక్ ఆకట్టుకుంటుంది. తండ్రీ కొడుకులను షూటింగ్ లోకేషన్ లో చూడాలన్న కోరిక సురేఖమ్మకు ఉండేదట. ఈ నేపథ్యంలోనే అటు భర్త, ఇటు కుమారుడు… ఇద్దరు కలిసి నటిస్తుండటంతో ఆమె షూటింగ్ చూడటానికి హాజరైనట్టు ఉన్నారు.
ఈ ఫోటో ఇప్పటిది కాదు.. సెట్స్‌కు సురేఖమ్మ వెళ్లి చాలా రోజులు అయ్యింది. చిరంజీవి, చరణ్… ఇద్దరూ కామ్రేడ్ డ్రస్‌లలో ఉన్నప్పుడు ఆ షూట్ చేశారు. అప్పటి ఫొటో ఇప్పుడు బయటకు వచ్చింది. దీనికి కారణం సురేఖ పుట్టినరోజు ఈ రోజు (ఫిబ్రవరి 18). ఈ సందర్భంగా తల్లిదండ్రులతో దిగిన ఫొటోను సోషల్ మీడియా ఖాతాల్లో రామ్ చరణ్ పోస్ట్ చేశారు. “నీకు తెలిసినంతగా నా గురించి ఎవరికీ తెలియదు. హ్యాపీ బర్త్ డే మా” అని ఆయన పేర్కొన్నారు. మెగాస్టార్ చిరు.. తనయుడు రామ్ చరణ్ లు నటించే షూటింగ్ సెట్స్ కి వెళ్లడం కామన్ అయినా.. ఇద్దరూ కలిసి నటిస్తున్నప్పుడు చూడటం ఆమెకు స్పెషల్ మొమెంట్ అయ్యి ఉంటుందని అభిమానులు తెగ సంతోష పడుతున్నారు.
No one knows me like you do!!
Happy birthday maa🎂❤️!! pic.twitter.com/CEzqCsvsSZ— Ram Charan (@AlwaysRamCharan) February 18, 2022